తమిళనాడులో సర్వేల గందరగోళం

Update: 2016-05-13 07:08 GMT
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల సందర్భంగా నిర్వహించే సర్వేలు దాదాపు ఒకేలాంటి ఫలితాల్ని కాస్త అటూఇటూగా చెప్పేస్తుంటాయి. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా అమ్మకు ఎదురులేదని.. ఈసారి రికార్డు స్థాయిలో అమ్మ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తగ్గట్లే సర్వేలు కూడా అలాంటి మాటలే చెప్పాయి.

కానీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ షురూ అయిన నాటి నుంచి రాజకీయం నెమ్మదిగా మారుతోంది. దీనికి తగ్గట్లే సర్వే సంస్థల ఫలితాల అంకెల్లోనూ మార్పు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు రోజుల్లోకి వచ్చేసిన తాజా పరిస్థితుల్లో ఏ పార్టీ కూటమి అధికారాన్నిసొంతం చేసుకుంటుందన్ని ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజింగ్ మారింది. దీనికి సర్వే సంస్థలది కూడా బాధ్యత ఉందని చెప్పాలి. ఎన్నికల ప్రక్రియ మొదలు కావటానికి ముందు నుంచి ఇప్పటివరకూ పలు మీడియా సంస్థలు వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్ని క్రోడికరించి సింఫుల్ గా విషయాన్ని చెప్పేస్తే.. తమిళనాడు ఎన్నికల మీద ప్రముఖ సర్వే సంస్థలు ఐదు సర్వేలు నిర్వహిస్తే మూడు సంస్థల అధికారపక్షమైన జయలలిత అధికారాన్ని చేజిక్కించుకోవటం ఖాయమని చెబితే.. మరో రెండు సంస్థలు మాత్రం విపక్ష డీఎంకే కు పవర్ పక్కా అని చెప్పటం విశేషం.

ఇలా ప్రముఖ సంస్థ విరుద్దమైన సర్వే ఫలితాల్నిప్రకటించంతో అధికారం ఎవరికి  సొంతం కానుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదట్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించట్లదన్న మాట వినిపించిన డీఎంకే ప్రచారం జోరుగా చేస్తుంటే.. అధికారపక్షమైన జయలలిత వర్గం ప్రచారంలో వెనుకబడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐదు సంస్థలు వెలువరించిన సర్వే ఫలితాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఒక్కటే.. అధికార అన్నాడీఎంకే కు కానీ.. ఇటు విపక్ష డీఎంకే పక్షానికి కానీ గెలుపు అంత సులువు కాదని.. ఇరు వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని అర్థమవుతుంది. ఒకసారి పవర్ ఇచ్చిన పార్టీకి రెండోసారి పవర్ ఇచ్చే అలవాటు లేని తమిళ ప్రజలు ‘అమ్మ’కు ఆ అవకాశం ఇస్తారా? అన్ని సందేహంగా మారింది.

ఇక.. ఐదు సర్వే సంస్థలు చెబుతున్న ఫలితాలు చూస్తే..

మీడియా సంస్థ        అన్నా డీఎంకే        డీఎంకే      ఇతరులు

టైమ్స్ నౌ        ;          130                70          34

ఇండియా టీవీ  ;           116                101        17

న్యూస్ 7.. దినమలర్ ;    52                108         74

పుదియతలైమురై     ;    164                 56         14

గుడ్ విల్ కమ్యూనికేషన్;   90               139           5
Tags:    

Similar News