బీహార్ లో ఎన్నికలు మొత్తానికి పోటా పోటీగా సాగబోతున్నాయి. ఏ కూటమి విజయం సాధించినా.. వారికి దక్కే సీట్ల ఆధిక్యం మాత్రం చాలా స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. నిన్నటికి నిన్న ఒక సంస్థ జరిపిన సర్వేలో మహా కూటమి విజయం సాధిస్తుందనే ప్రజాభిప్రాయం వెల్లడవగా.. ఇండియాటుడే ఛానెల్ వారి సర్వేలో భాజపాకే అధికారం దక్కుతుందని తేలింది. అయితె మెజారిటీ మాత్రం తక్కువే. 243 సీట్లున్న బీహార్ లో భాజపాకు 125 సీట్లు దక్కే అవకాశం ఉన్నదని ఇండియాటుడే అంచనా. మహాకూటమికి 106 సీట్లు దక్కుతాయని వీరు తేల్చారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మెజారిటీ వ్యత్యాసాలు కూడా స్వల్పంగానే ఉంటాయని నిగ్గు తేల్చారు.
ఎలాగైనా సరే.. బీహార్ లో అధికార పీఠం దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికే 1.75 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని బీహార్ కు ఇస్తానంటూ మోడీ ప్రకటించారు. బీహార్ లో రోజంతా విద్యుత్తు సరఫరా ఉంచేందుకు కేంద్రం కొత్తగా 1850 కోట్ల రూపాయలు కూడా కేటాయించింది. బీహార్ ప్రభుత్వం విద్యుత్తును యూనిట్ 4.15 కు కాకుండా.. రూ.2 కే కొనేలా ఒక సదుపాయాన్ని కూడా కల్పించింది. ఇలా బీహార్ ప్రయోజనాలకు ఇబ్బడి ముబ్బడిగా సహకరిస్తూ అక్కడి ఎన్నికలు గెలవాలని కేంద్రంలోని భాజపా నానా తంటాలు పడుతున్నది. ఇంత చేస్తున్నా.. ప్రస్తుతానికి రెండు కూటముల మధ్య ఉన్న తేడా చాలా స్వల్పం కావడం వారిని కలవరపెట్టే పరిణామం. ప్రచారంలో మరికొంత ముందుకు వెళ్లే సరికి పరిస్థితులు ఇంకా బాగా మెరుగుపడతాయని భాజపా వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం ఇక్కడ చిన్న ట్విస్టు ఉంది. సీట్లు భాజపాకే ఎక్కువ వస్తాయి గానీ.. ప్రజలు ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నే కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో భాజపాకు చెందిన సుశీల్ కుమార్, ఆర్జేడీకి చెందిన లాలూప్రసాద్ ల మీద జనాభిప్రాయం ఉన్నదిట.