వైసీపీలోకి తమ్ముడు..తెలియదంటున్న అన్న!

Update: 2020-03-13 11:30 GMT
తెలుగుదేశం పార్టీ ..ఒకప్పుడు ఏపీని కొన్నేళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా ఏలిన పార్టీ. కానీ, 2019 ఎన్నికలలో పార్టీ పెట్టిన తరువాత ఎప్పుడు చూడని ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆ ఎదురుదెబ్బ నుండి బయటకి రావాలని చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా సఫలం అవుతున్నట్టు కనిపించడంలేదు. ఇప్పటికే ఎన్నికలలో ఘోర ఓటమి తో దిక్కుతోచని స్థితిలో ఉన్న టీడీపీ అధిష్టానానికి షాక్ ఇస్తూ .. పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు.

ముఖ్యంగా ఏపీలో స్థానిక ఎన్నికలు షురూ చేసినప్పటి నుండి టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ఒక్కసారిగా ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. దీనితో ఒకప్పుడు ఏపీలో వరుసగా అధికారాన్ని చేపట్టిన టీడీపీ ..ఇప్పుడు కొన్ని చోట్ల స్థానిక ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంది అంటే, పార్టీ పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే, తాజాగా కర్నూల్ టీడీపీ లో కీలక నేతగా ఉన్న కేఈ ప్రభాకర్ రాజీనామా పార్టీని ఒక్కసారిగా కుదిపేసింది. జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్‌ కు మంచి పట్టు ఉంది.

అయితే తమ్ముడి రాజీనామా విషయం తనకు తెలియదని కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు. పార్టీ వీడే అంశం గురించి మాట్లాడలేదని చెప్పారు. అలాగే ప్రభాకర్‌ వైసీపీలోకి వెళ్లిన అభ్యంతరం లేదని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. అయితే , నిన్న మొన్నటి వరకు వైసీపీ అంటే ఒంటికాలిపై లేచి కృష్ణమూర్తి స్వరం ..కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిన అభ్యంతరం లేదు అని చెప్పడంతో ..త్వరలోనే తమ్ముడి దారిలో అన్న కూడా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఈ విషయం పై ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చ జరుగుతుంది. ప్రభాకర్ మాత్రం టీడీపీ హై కమాండ్, మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై నొచ్చుకొని పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. కానీ తమ్ముడి పార్టీ మారే విషయం మాత్రం తనకు తెలియదని చెప్పడం తో అయన వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Tags:    

Similar News