క‌రోనా ఒక‌వైపు ఊర‌ట‌ - మ‌రోవైపు ఆందోళ‌న‌!

Update: 2020-03-15 14:30 GMT
క‌రోనా వైర‌స్ గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ఆగ‌డం లేదు. ఒక‌వైపు క‌రోనాకు మందును క‌నుగొన్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దాన్ని అంత తేలిక‌గా మ‌నుషుల మీద ప్ర‌యోగించ‌డానికి వీల్లేద‌ని..ప్ర‌యోగాల అనంత‌రం అది అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంటున్నారు. దానికి ఇంకా ఏడాది స‌మ‌యం ప‌ట్టినా ప‌ట్ట‌వ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న వైద్య ప‌ద్ధ‌తుల ద్వారా క‌రోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేస్తూ, కొంత‌మందికి చికిత్స అందించి, డిశ్చార్జి చేస్తున్న‌ట్టుగానూ వార్త‌లు వ‌స్తున్నాయి. చైనాలోనే చాలా మందికి క‌రోనా నివారించ‌బ‌డిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక ఇండియాలో క‌రోనా సోకిన పేషెంట్ల‌కు చికిత్స చేసి డిశ్చార్జి చేశారు కూడా.

ఇలా ప‌రిస్థితి కంట్రోల్ లోకి వ‌స్తోంద‌నే అభిప్రాయాలకు కార‌ణం అవుతున్నాయి ఈ వార్త‌లు. అయితే అమెరిక‌న్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ ఒక సంచ‌ల‌న అంశాన్ని ప్ర‌స్తావించింద‌ట‌. దాని అంచ‌నాల ప్ర‌కారం.. ఒక్క అమెరికాలోనే 17 కోట్ల మంది కి క‌రోనా సోకుతుంద‌ని అంచ‌నా వేశార‌ట‌. వారిలో రెండు నుంచి 17 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తార‌ని అక్క‌డ అంచ‌నా వేశార‌ట‌. అది కంప్యూట‌రైజ్డ్ అంచ‌నాలు అని స‌మాచారం.

అమెరికా జ‌నాభాలో అలా స‌గం మందికి క‌రోనా సోకుతుంద‌ని ఆ సంస్థ అంచ‌నా వేసింద‌ట‌. అయితే ఆ అంచ‌నాల్లో నిజ‌మెంత అనేది మాత్రం లాజిక్ లేని అంశ‌మే. అంత‌లోపు క‌రోనాకు మందు క‌నుగొంటే.. ఆ ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు. ఏదేమైనా ప్ర‌స్తుతానికి అయితే కరోనా గురించి అంచ‌నాలు, అపోహ‌లే ఎక్కువ‌గా ప్ర‌చారం పొందుతున్నాయి. ఇండియా విష‌యానికి వ‌స్తే..మార్చి నెలాఖ‌రు వ‌ర‌కూ క‌రోనా వైర‌స్ కేసులు పెర‌గ‌వ‌చ్చ‌ని, ఆ త‌ర్వాత మాత్రం వాటి సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని, మండే ఎండ‌లు ఇండియాలో క‌రోనాను నిరోధిస్తాయ‌ని, అయితే థియేట‌ర్లు, షాపింగ్ మాల్స్, స్కూళ్లు మూత ప‌డ‌టం మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.
Tags:    

Similar News