చైనాలో మరో కరోనా వేవ్ వచ్చి అక్కడి నగరాలన్నీ లాక్ డౌన్ అయిపోయారు. ఇప్పుడు భారత్ లో కూడా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తేరుకునేలా లోపే విరుచుకుపడుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.
ఢిల్లీలో ఆరు రోజులుగా 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. దాంతో అలెర్ట్ అయిన ఢిల్లీ సర్కార్.. కరోనా కట్టడికి ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వ్యక్తులపై రూ.500 జరిమానా విధిస్తోంది. ఇక మార్కెట్ వ్యాపారులను బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరుతున్నారు.
ఢిల్లీలో ఇప్పటివరకూ 18.78 లక్షల మంది కరోనా బారినపడ్డారు. మరణాల సంఖ్య 26170కి చేరింది. తాజాగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే పాజిటివిటీ రేటు 4.50 శాతంగా ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. రోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అయితే దేశంలో 4వ వేవ్ వస్తుందన్న భయాందోళనల నడుమ నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఇది 4వ వేవ్ కు సంకేతం కాదని అభిప్రాయపడ్డారు. సాధారణంగా కోవిడ్ ఉప్పెన, నిర్ధిష్ట వైరస్ ప్రభావ గరిష్ట స్థాయిని లెక్కించినప్పుడు సగటు కేసుల పాజిటివిటీ రేటు, మొత్తం మరణాల రేటును పరిశీలిస్తామని తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు సగటు 4-5 శాతం మార్కు వద్ద ఉందని తెలిపారు. ఇది మరింతగా పెరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం కరోనా బారినపడిన వారిలో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య 1 శాతం కంటే కూడా తక్కువగా ఉంది. ఈ కారణంగానే ఢిల్లీని రెడ్ జోన్ గా ఇంకా ప్రకటించలేదు అని కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఎయిమ్స్ వైద్యుడు అజయ్ నంబియార్ తెలిపారు.
వారం రోజులుగా కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోందన్నారు. ఇక దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డిల్లీలోనూ కరోనా బారిన పడిన వారిలో కేవలం 1.58 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరుతున్నారన్నారు.