భూకంపం జపాన్ కు మామూలే. మనకు వర్షాలు పడటం.. ఎండల కాయటం ఎంత మామూలు విషయమో.. జపాన్ లో భూకంపాలు అంతే మామూలు. ఒకపక్క భూమి కంపిస్తున్నా వారిలో పెద్దగా ఆందోళన కనిపించదు. అలాంటి జపాన్ లో మొన్నామధ్య భూకంపం చోటు చేసుకొని పది మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండే జపాన్ లో భూకంపం కారణంగా10 మందికి పైగా మరణించటం అంటే సామాన్య విషయం కాదు. నిజానికి అలాంటి విపత్తే భారత్ లాంటి దేశానికి వస్తే కనీసం 5 వేల మందికి పైగా మరణించి ఉండేవారు.
అంతేకాదు.. తాజాగా చోటు చేసుకున్న భూకంపం ధాటికి 45 వేల మందికి పైగా జపనీయులు సహాయక కేంద్రాల్లో తలదాచుకున్నారంటే.. భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే చెప్పొచ్చు. జపాన్ భూకంపం తీవ్రత గురించి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. ఈక్వెడార్ లో చోటు చేసుకున్న పెను భూకంపం ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన కొద్ది నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాల తీవ్రత తరచూ చోటుచేసుకుంటోంది.
ఏడాది క్రితం నేపాల్ లో చోటు చేసుకున్న భారీ భూకంప విధ్వంసంతో పాటు.. మయన్మార్.. ఇండోనేషియా.. అఫ్ఘనిస్తాన్.. పాక్.. భారత్ లలోనూ భూకంపాల తీవ్రత ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. తరచూ చోటు చేసుకుంటున్న భూకంపం మీద ఆందోళనకర వాదన ఒకటి బయలుదేరింది. అయితే.. ఇందులో నిజం సంగతిని పక్కన పెడితే.. భూకంపాల కాలంలోకి భూమి అడుగు పెట్టనుందా? అన్నది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న.
దీనిపై నిపుణులు సైతం వెంటనే సమాధానం చెప్పలేకపోతున్నారు. 60 ఏళ్ల కిందట 8.5 కన్నా ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు ఏడుసార్లు వచ్చాయి. అదే సమయంలో గడిచిన 40 ఏళ్లలో పెను భూకంపాలు రాలేదు. ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నంగా వరుసగా భూకంపాలు వస్తున్న పరిస్థితి. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు నిపుణులు. అయితే.. వారు సైతం వ్యక్తం చేస్తున్న సందేహం ఒక్కటే.. భూకంప క్రియాశీల కాలంలోకి భూమి జారిపోయిందా? అని. దీనిపై పరిశోధనలు మొదలు పెట్టిన నిపుణులు.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెబుతున్నారు. తాజాగా వారు ఇస్తున్న వార్నింగ్ ఒకటి మాత్రం అందరిలో వణుకు పుట్టిస్తోంది. భూకంప ముప్పు భారీగా ఉందని.. ఏ క్షణంలో అయినా శక్తివంతమైన ప్రకంపనలు చోటు చేసుకునే వీలుందని.. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ముప్పు ఎక్కువని చెబుతున్నారు. అంటే.. మరిన్ని విలయాలకు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలా?