ముంబైలో వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం వద్ద ఇటీవల ఓ వాహనంలో పేలుడు పదార్థాలు ఉండడం తీవ్ర కలకలం రేపింది. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ వాహనం యజమాని హిరేన్ మన్సూఖ్ థానేలో శవమై కనిపించాడు. తాజాగా అనుమానాస్పదంగా మరణించిన స్కార్పియో ఓనర్ మన్సుఖ్ హిరెన్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. నేరపూరిత కుట్ర, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై మహారాష్ట్ర ఏటీఎస్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. హిరేన్ భార్య విమల ఫిర్యాదు మేరకు మరణించిన రెండు రోజుల తరువాత, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం ఆదివారం హత్య కేసు నమోదు చేసింది. అలాగే రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం హిరెన్ మరణానికి సంబంధించిన కేసును ఏటిఎస్ కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.
దీంతో సంబంధిత పత్రాలన్నీ ఏటీఎస్ విభాగం స్వాధీనం చేసుకుని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి విచారిస్తున్నారు. ఈ కేసులో హిరేన్ ఒక్కడే సాక్షి అతడిని కూడా కోల్పోయామని అని దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. హిరేన్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్‌ఐఏ దర్యాప్తును డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసు అధికారులు తనను వేధిస్తున్నారని, ఈ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా థానే, ముంబయి పోలీస్ కమిషనర్లకు హిరేన్ మార్చి 2న లేఖ రాశారు.
ఇదిలా ఉంటే .. ఈ క్రమంలో, అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలు లభ్యమైన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ)కి అప్పగించారు. కేసును స్వీకరించిన అనంతరం ఎన్ ఐ ఏ వర్గాలు స్పందించాయి. కేసు మరోసారి నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఫిబ్రవరి 25న ముంబయిలోని ముఖేశ్ అంబానీ నివాసం యాంటిల్లా వద్ద ఓ స్కార్పియో వాహనం నిలిపి ఉంచడం గుర్తించారు. అందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. ఆ వాహనం ఫిబ్రవరి 18న ఐరోలీ-ములుంద్ బ్రిడ్జి వద్ద చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. కాగా, అంబానీ నివాసం వద్ద వాహనం నిలిపి ఉంచిన కేసులో సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు హిరేన్ ను హత్య చేసి ఉంటారన్న వాదనలు బలపడుతున్నాయి. దీనిపై ఏటీఎస్ దర్యాప్తు అధికారి స్పందిస్తూ, ఈ కేసులో హిరేన్ ఒక్కడే సాక్షి అనుకుంటే, ఇప్పుడతడ్ని కూడా కోల్పోయామని వ్యాఖ్యానించారు.