తమిళనాడు సర్కారుపై నిప్పులు చెరిగిన ప్రముఖ నటుడు కమల్ హాసన్.. రెండు రోజులకే తాను చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వటంతో.. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. ఎవరి మనసుల్ని అయినా నొప్పించి ఉంటే క్షమించాలని కోరటం తెలిసిందే. అంత ధైర్యంగా మాట్లాడిన కమల్ రెండు రోజులకే అంతగా జావకారిపోయినట్లు మాట్లాడారెందుకు? అన్న సందేహం పలువురికి కనిపించింది.
తాజాగా.. దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. చెన్నై మహానగరాన్ని దారుణంగా దెబ్బ తీసిన భారీ వర్షాలు.. వరద కారణంగా లక్షలాది మంది ప్రజలు దారుణంగా నష్టపోవటం.. తీవ్ర అవస్థలకు గురి కావటం తెలిసిందే. ఈ పరిస్థితిని చూసి ఎందరో స్పందించారు. వారంతా ఒక ఎత్తు అయితే.. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్.. ఒక మీడియా మిత్రుడికి ఈ మొయిల్ రాసి తన ఆవేదనను పంచుకున్నారు. ఈ మొయిల్ లో చెప్పుకున్న ఆవేదనను.. ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ గా మలచటం.. అది అచ్చేసి బయటకు రావటం సంచలనంగా మారింది.
తమిళనాడు ప్రభుత్వాన్ని.. అందునా ముఖ్యమంత్రిగా జయలలితను అంత ఘాటుగా విమర్శించిన కమల్ హాసన్ ధైర్యానికి చాలామంది మెచ్చుకున్నారు. కానీ.. రెండు రోజులకే సీన్ మారిపోయి.. తన వ్యాఖ్యలపై విచారణ.. క్షమాపణలు చెప్పేశారు. ఎందుకిలా జరిగిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కమల్ ఉత్తరం వెలుగు చూసిన వెంటనే.. ఆయన ఇంటితో పాటు.. ఆ ఇల్లు ఉన్న అళ్వార్ పేటకు విద్యుత్తు సౌకర్యం కట్ చేసి పారేశారు. అనంతరం కమల్ చెంపలేసుకోవటానికి సిద్ధం ఉన్నానని.. క్షమాపణలు చెప్పటానికి సైతం రెఢీ అనటతో కట్ చేసిన విద్యుత్తును పునరుద్దరించారు. ‘అమ్మ’ రాజ్యంలో ఒక విమర్శకు ఫలితం ఏ రేంజ్ లో ఉంటుందో కదూ..?