అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ భారీ షాక్ ఇచ్చింది. తమ నిబంధనలను అతిక్రమిస్తున్నప్పటికీ..ఆసక్తికరంగా ఉండే పోస్టులకు ట్యాగ్ లు యాడ్ చేస్తామని ప్రకటించింది. ట్రంప్ పోస్ట్ చేసే ట్వీట్ల విషయంలో ట్విటర్ ఇదే విధంగా వ్యవహరిస్తుందని, దీనితో తాముకూడా దాన్ని ఫాలో అవుతామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు.
అదే సమయంలో ద్వేషాన్ని రెచ్చగొట్టే యాడ్ లను నిషేధిస్తామని అన్నారు. జాత్యహంకారాన్ని, ద్వేషం లేదా హింసను ప్రేరేపించే కంటెంట్ ను ఫేస్ బుక్ నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రత్యేకంగా ఒక దేశాన్ని, వ్యక్తులను, వారి రంగును, కుల మతాలను, జెండర్ ఐడెంటిటీని విమర్శించేట్టు ఉండే, లేదా వ్యక్తుల భద్రత, వారి ఆరోగ్యానికి భంగం కలిగించే పోస్టులను బ్యాన్ చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఇది తమ కొత్త పాలసీ అన్నారు. ఈ విధమైన కంటెంట్ తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందన్నారు.
అమెరికాలో గత మే 25 న నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య అనంతరం దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఆ సందర్భంలో నిరసనకారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్లను ఫేస్ బుక్ వంటి సాధనాలు పోస్ట్ చేశాయి. అయితే అవి జాతి వివక్షను, హింసను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని వాటిని తొలగించాలని అనేకమంది కోరినప్పటికీ ఫేస్ బుక్ అందుకు నిరాకరించింది. వాటిని తొలగించేందుకు మార్క్ జుకర్ బెర్గ్ అంగీకరించలేదు. దీంతో తమ సంస్థ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పలువురు ఉద్యోగులు రాజీనామాలు చేశారు.
తాజాగా జుకర్ బెర్గ్ తమ సంస్థ ప్రతిష్ట మసక బారుతున్నట్టు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే నిబంధనలను అతిక్రమించే కంటెంట్ కి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. అయితే చదవదగిన వార్తలకు ట్యాగ్ లు జత చేస్తామని, వీటి విషయంలో యూజర్లు తమ కంటెంట్ ని షేర్ చేసుకోవచ్ఛునని ఆయన తెలిపారు. ఐతే , ఇప్పటికే ట్రంప్ , అయన మద్దతుదారులు ట్విట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేస్ బుక్ తీసుకున్న ఈ నిర్ణయం పై వారు ఏ విదంగా స్పందిస్తారో ...