ఫేస్‌ బుక్‌ లో డేటింగ్ ఫీచ‌ర్‌..

Update: 2019-09-07 08:36 GMT
ఇక చాటుమాటు ఘాటు ప్రేమ‌ల‌కు వేదిక దొరికింది. ఇందుకోసం  సోష‌ల్‌ మీడియా దిగ్గ‌జం ఫేస్‌ బుక్ మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్ తీసుకొచ్చింది. ఇక నుంచి హాయిగా ఫేస్‌ బుక్‌ లో డేటింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. దీనికి సీక్రెట్ క్ర‌ష్ అంటే ర‌హ‌స్య ప్రేమ అని పేరు పెట్టింది ఫేస్‌బుక్‌. ఇప్ప‌టికే అనేక ఫీచ‌ర్ల‌తో మ‌నిషి లైఫ్‌ స్టైల్‌ ను మార్చేసిన ఫేస్‌ బుక్ తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్‌ ను తీసుకు రావ‌డంతో మ‌రిన్ని సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతుందోన‌ని నెటిజ‌న్లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే.. ఈ ఫీచ‌ర్‌ను కేవ‌లం అమెరికా యూజ‌ర్ల‌కు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సీక్రెట్ క్ర‌ష్‌ ఫ్లాట్‌ ఫామ్‌ పై యూజ‌ర్లు తమ ఇష్టాయిష్టాలను నిర్భయంగా పరస్పరం పంచుకోవచ్చు. అంతేగాకుండా.. తమ మిత్రుల మిత్రులను కూడా ఈ ఫీచ‌ర్‌ ద్వారా పరిచయం చేయవచ్చు. వారి వివరాలను కూడా ఈ కొత్త ఫీచర్‌ లో పొందుపర్చవచ్చు. దీనికి ఫేస్‌ బుక్‌ యూజర్లతోపాటు ఇన్‌ స్టాగ్రామ్‌ యూజర్లను - ఇన్‌ స్టాగ్రామ్‌ ఫొటోలను కూడా అనుసంధానించవచ్చ‌ట‌. అయితే.. ఇక్క‌డ ఫేస్‌బుక్ కంటే ముందే టిండ‌ర్ అనే వెబ్‌ సైట్ డేటింగ్ వేదిక‌గా నిలిచింది. ఇప్పుడు టిండ‌ర్‌ కు పోటీగా ఫేస్‌ బుక్ ఈ సీక్రెట్ క్ర‌ష్ ఫీచ‌ర్‌ ను తీసుకొచ్చింది.

అయితే.. ఇతర డేటింగ్‌ సైట్లలాగా ఒకరితో ఒకరు కనెక్ట్‌ కావడానికి పరస్పరం ‘మ్యాచ్‌’ కావాల్సిన అవసరం లేదు. న‌చ్చిన వారి ప్రొఫైల్‌ ను - ఫొటోపై కామెంట్ చేస్తే చాలు ఈ సీక్రెట్ క్ర‌ష్‌ తో క‌నెక్ట్ కావొచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ లో ఒక్కరు తొమ్మిది మంది ఫేస్‌ బుక్‌ లేదా ఇన్‌ స్టాగ్రామ్‌ యూజర్లకు కనెక్ట్‌ కావచ్చు. తద్వారా వారి మిత్రులే కాకుండా మిత్రుల మిత్రుల ప్రొఫైల్స్‌ను కూడా షేర్‌ చేసుకోవచ్చు. హాయిగా మాట్లాడుకోవచ్చు.

ఒక‌వేళ‌ ఎదుటి వారు నచ్చకుంటే వెంట‌నే ఇంటూ మార్క్‌ ను క్లిక్ చేస్తే చాలు. అంతేగాకుండా.. ఫేస్‌ బుక్ - ఇన్‌ స్టాగ్రామ్‌ లలో నిక్షిప్తం చేసిన సమాచారం - ఫొటోలను నేరుగా ఈ ‘సీక్రెట్‌ క్రష్‌’పైకి తీసుకొచ్చి మిత్రులతో షేరు చేసుకోవచ్చు. నిజంగా డేటింగ్‌ చేయాలనుకుంటున్న వారి జాబితాను కూడా ఇందులో ‘సీక్రెట్‌’గా దాచుకోవచ్చు. మ‌రి ఇప్పుడు ఈ సీక్రెట్ క్ర‌ష్ మ‌నిషి లైఫ్‌ స్టైల్‌ లో మ‌రెన్ని మార్పులు తెస్తుందో ? చూడాలి మ‌రి.


Tags:    

Similar News