ఇంటర్నెట్ లో ఫేస్ బుక్ అంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా టాప్ సోషల్ మీడియాతో ఇది ఉంది. ఎంతో మంది తమ భావాలను వ్యక్తం చేసే ఫ్లాట్ ఫామ్ ఇది. ఒక సోషల్ నెట్ వర్కింగ్ ఫ్లాట్ ఫాం అనే కాక విజయవంతమైన సాఫ్ట్ వేర్ సంస్థగా కూడా ఫేస్ బుక్ గుర్తింపు పొందింది. 2004లో ప్రారంభమైన ఫేస్ బుక్ సంస్థలో 2009 నాటికి కేవలం 1000 మంది ఉద్యోగులే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఫేస్బుక్ సంస్థకు 65 దేశాల్లో కార్యాలయాలుండగా.. 13000 మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారందరికీ ఫేస్ బుక్ లో ఉద్యోగం సంపాదించాలనేది చాలా మంది కల.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఈ ఫేస్ బుక్ లోకి ఎంట్రీ కావాలని తహతహలాడుతుంటారు. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ మీద మాంద్యం బండ పడింది. దీంతో ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతున్న పరిస్థితి నెలకొంది.
కరోనా కల్లోలం ముగిసినా దాని తాలూకా మాంద్యం మంటలు అంటుకున్నాయి. కరోనాతో కుదేలైన రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. చాలా కంపెనీలు ఈ నష్టాలను అధిగమించేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. మ్యాన్ పవర్ తగ్గించి నష్టాలు పూడ్చుకోవాలని చూస్తున్నాయి.
తాజాగా ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ సహా అనుబంధ సంస్థల్లో నియామకాలను నిలిపివేస్తున్నట్టు మెటా (ఫేస్ బుక్) సంస్థ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలోపు ఉద్యోగుల సంఖ్య తగ్గించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
గత కొంతకాలంగా ఇతర మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా కోత విధిస్తూ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం సగం కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నాయని, చాలా వరకు బోనస్‌లను తగ్గిస్తున్నాయని, ఆర్థిక మాంద్యం మధ్య ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అమెరికాలో తాజా పీడబ్ల్యూసీ 'పల్స్: మేనేజింగ్ బిజినెస్ రిస్క్ ఇన్ -2022' సర్వే ప్రకారం, 50 శాతం మంది కంపెనీలు తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. అయినప్పటికీ ప్రతిభను నియమించుకోవడం.. నిలుపుకోవడం గురించి ఆందోళన చెందుతున్నారు. "అదే సమయంలో ప్రతివాదులు శ్రామిక శక్తిని క్రమబద్ధీకరించడానికి భవిష్యత్తు కోసం కార్మికుల నైపుణ్యాల పెంచేలా చురుకైన చర్యలు తీసుకుంటున్నారు
గత కొన్ని సంవత్సరాలుగా నియామకాల కోత కొనసాగుతోంది. కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసేశారు. సరైన నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను ఉంచుకొని మిగతా వారిని తీసేస్తున్నారు. "ఉదాహరణకు, మొత్తం కంపెనీలలో 50 శాతం మంది తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. 46 శాతం మంది సంతకం చేసే బోనస్‌లను వదులుకుంటున్నారు.. తగ్గించుకుంటున్నారు..44 శాతం మంది ఆఫర్‌లను రద్దు చేస్తున్నారు" అని ఒక నివేదిక వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్ మరియు మెటా (గతంలో ఫేస్‌బుక్) వంటి బిగ్ టెక్ కంపెనీలతో సహా యుఎస్‌లో జూలై వరకు 32,000 కంటే ఎక్కువ మంది టెక్ వర్కర్లు తొలగించారు. భారీ స్టాక్ అమ్మకాలను చూసిన టెక్ సెక్టార్‌కు ఇది పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. భారతదేశంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి 25,000 కంటే ఎక్కువ మంది స్టార్టప్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంవత్సరం 12,000 కంటే ఎక్కువ మంది తొలగించబడ్డారు. కొన్ని పరిశ్రమల్లో ఈ ముందుజాగ్రత్త చర్యలు ఎక్కువగా ఉంటాయని పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.