ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన చికాగో గ్యాంగ్ రేప్‌నకు సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. షాపింగ్ కోసం షాపింగ్ మాల్‌కు వెళ్లిన 15 ఏళ్ల మైనర్ బాలికను మరికొంతమంది మైనర్ బాలురు బంధించి గ్యాంగ్ రేప్ చేయటం.. ఆ దారుణాన్ని ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ పెట్టటం పెను సంచలనంగా మారింది. ఈ లైవ్ ను చూస్తున్న వారెవరూ ఫిర్యాదు చేయకపోవటం.. బాధితురాలి తల్లిదండ్రులకు కొందరు ఫోన్ చేసి చెప్పటంతో ఈ దారుణం బయటకు వచ్చింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఈ దుర్మార్గానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి తెలిసిన వారే నిందితులు కావటం గమనార్హం.
పోలీసుల విచారణలో ఈ ఉదంతానికి సంబంధించిన మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. బాలికపై గ్యాంగ్ రేప్ నకు ముందే ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లకు 14 ఏళ్లుకావటం.. మరొకరి వయసు 15 మాత్రమే కావటం గమనార్హం. పథకం ప్రకారమే గ్యాంగ్ రేప్ చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు.
షాపింగ్ కు వెళుతున్న బాలికను తాము వెంబడించామని.. దగ్గర్లోని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశామన్నారు. బాలిక పారిపోకుండా ఉండేందుకు కుక్కను మీదకు వదులుతామని బెదిరించిన వైనం బయటకు వచ్చింది. జరిగిన దారుణం గురించి బాధిత బాలిక కోర్టులో తన ఆవేదనను వెళ్లగక్కింది. తనను చాలాసార్లు చెంపదెబ్బ కొట్టారని.. తాము చేసిన అకృత్యాన్ని లైవ్ లో పెట్టగా.. 40 మంది చూశారే కానీ.. ఏ ఒక్కరూ దీనిపై ఫిర్యాదు చేయకపోవటంపై చికాగో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసింది మైనర్లే అయినా.. చర్యలు తప్పవని.. నిందితులు చిన్న వయస్కులు కావటంతో వారి వివరాలు వెల్లడించటం లేదని పోలీసులు చెబుతున్నారు. చిన్న వయసులోనే ఇంత దుర్మార్గపు ఆలోచనలకు కారణమైన వారిని అత్యంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం అగ్రరాజ్యానికి ఉంది. మరి.. అక్కడి చట్టం బాధితురాలికి ఎంత న్యాయం చేస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/