ద్రౌపది పేరు వెనక : కొత్త రాష్ట్రపతి గురించి ఆసక్తికర విషయాలు

Update: 2022-07-25 10:30 GMT
భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రమాణం చేశారు. ఆమె గురించి ఇపుడు అంతటా చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆమె ఈ దేశానికి ప్రధమ పౌరురాలు. ఆమె ఈ దేశ రాజ్యాంగ పరిరక్షకురాలు. అయిదేళ్ల పాటు ఈ దేశాన్ని ఆమె పాలిస్తారు, శాసిస్తారు. ఆమె తాను నియమించిన కేంద్ర మంత్రివర్గం సలహా సూచనల మేరకు దేశ భవితను నిర్ణయిస్తారు.

నిజంగా రాష్ట్రపతి పదవి రాజ్యాంగం ప్రకారం అత్యంత శక్తివంతమైనదే.  ఆమె తలచుకుంటే ఈ దేశంలో ఏ చట్టాన్ని అయినా తీసుకురాగలరు. అలాంటి కీలకమైన పదవిలో ఉన్న నూతన రాష్ట్రపతి గురించి ఇపుడు దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆమె జీవిత విశేషాలను ఆసక్తిగా చదువుతున్నారు.

కొత్త రాష్ట్రపతి ఒడిషా రాష్ట్రం మయూర్ బంజ్ జిల్లాకు చెందిన వారు. ఆమె అసలు పేరు పుతి ముర్ము. తనకు సంత‌లి సంస్కృతి ప్ర‌కారం త‌న‌కు పుతి అనే పేరును పెట్టార‌ని ఆమె జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నపుడు ఒడియా వీడియో మ్యాగ్జిన్‌కు కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలనే చెప్పారు. తన అసలు పేరు ద్రౌపది కాదని ఆమె నాడు చెప్పారు.

తన పేరును ద్రౌపదిగా తనకు చదువు చెప్పిన పాఠశాల టీచర్ పెట్టారని ఆమె ఈ సందర్భంగా తెలియచేయడం విశేషం. మహా భారతంలో బాగా ప్రాచుర్యం పొందిన వీర ధీర మహిళ ద్రౌపది పేరుని తమ టీచర్ తనకు పెట్టి ఆశీర్వదించారని నాటి ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకున్నారు.

అలా తన అభివృద్ధిని తన భవిష్యత్తుని నాడే ఊహించి ఆ టీచర్ ఆ పేరు పెట్టి ఉంటారని  గవర్నర్ గా ద్రౌపది ముర్ము నాడు చెప్పుకుని మురిసారు. ఇపుడు ఆమె ఏకంగా రాష్ట్రపతి అయ్యారు. మరి నాటి టీచర్ ఇంకా ఎంతో ఎత్తున ఊహించి ఆ పేరు పెట్టారని అనుకోవాలి. ఆమె చలవతో దీవెనలతో ఈ రోజు దేశానికే ప్రధమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఉండడం అంటే ఆ టీచర్ ఆశీర్వాద బలం ఎంతో కదా.

ఇక ద్రుపది ఇంటి పేరు అంటే తన తల్లిదండ్రులది తుడు అని ఉండేది. ఇదే పేరుతో ఆమె విద్యాభ్యాసం అంతా పూర్తి చేసుకుంది. సంత‌లి తెగ‌లో అమ్మాయి పుడితే అమ్మమం పేరునే ఇంటి పేరుగా పెడతారు. అబ్బాయి పుడితే తాతయ్య పేరునే ఇంటిపేరుగా చేరుస్తారు. అలా తన అమ్మమ్మ పేరు తుడుతో ఆమె చదువుకుని పెరిగి పెద్దయ్యారు. అయితే ఆమె  బ్యాంక్ ఆఫీస‌ర్ శ్యామ్ చ‌ర‌ణ్ ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత తన ఇంటి పేరుని  ముర్ముగా మార్చుకున్నారు.  మొత్తానికి చూస్తే ద్రౌపది ముర్ము అన్న పేరు ఆమె పుట్టినపుడు లేదు కానీ ఆ తరువాత ఆమెతో జత కలసి ఈ రోజున దేశానికి అత్యున్నత పీఠాన్ని అందుకునేలా చేశాయని చెప్పవచ్చు.
Tags:    

Similar News