క్రికెట్ అభిమానులకు అతగాడు పరిచయస్తుడు. అతడి జట్టు పసికూనే కావొచ్చు. కానీ.. అతగాడు మాత్రం స్టార్ ప్లేయర్. ఎంతంటే.. వరల్డ్ కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ టైటిల్ ను సొంతం చేసుకునే ఆటగాడిగా ఇప్పుడతని పేరు మారుమోగుతోంది. ఆటతోనే కాదు.. వివాదాలతోనూ తరచూ అందరి దృష్టిని ఆకర్షించే అతగాడు ఎవరో కాదు.. బంగ్లాదేశ్ ఆలౌ రౌండర్ షకిబ్ అల్ హసన్.
బ్యాటుతోను బౌల్ తోనూ ఒక ఆట ఆడుకునే షకిబ్ తాజా టోర్నీలో ఇప్పటికే భారీగా పరుగుల వరద పారించటమే కాదు.. బాల్ తో పెద్ద ఎత్తున వికెట్లు కూల్చేశాడు. దీంతో.. స్టార్ ఆటగాళ్లను తోసిరాజని మరి టోర్నీలోనే సో స్పెషల్ గా నిలిచారు. ప్రేక్షకులతోనూ.. ప్రత్యర్థి ఆటగాళ్లతోనే కాదు.. సొంత జట్టు ఆటగాళ్లతోనూ.. చివరకు అంపైర్లతోనూ గొడవపడే తీరు అతడి సొంతం. ఇన్ని వివాదాలు ఉన్నా.. ఏవీ హద్దులు దాటకుండా చూసుకోవటం ఒక ఎత్తు.. తన ఆటతో పోన్లేద్దూ అనిపించేలా చేయటం అతగాడికి మాత్రమే సాధ్యమవుతుందేమో.
ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ అతను ఆడిన ఏడు మ్యాచ్ లలో 476 పరుగులు చేయటమే కాదు.. బౌల్ చేసి ఇప్పటివరకూ పది వికెట్ల పడగొట్టాడు. టాప్ స్కోరర్లలో మూడోస్థానం.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ టెన్ లో ఉన్న అతగాడే టోర్నీ ఆఫ్ ద ప్లేయర్ గా చెప్పేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే బంగ్లాదేశ్ ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింటిలో బంగ్లాదేశ్ గెలిస్తే.. ఈ మూడింటిలోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అతడే కావటం చూస్తే.. అతగాడి ఆటతీరు ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
అలాంటి హసన్ వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరమని చెబుతారు. అతడికో అందమైన భార్య ఉంది. ఆమె పేరు ఉమి అహ్మద్ శిశిర్. బంగ్లాదేశ్ లో పుట్టిన ఆమె కొన్నాళ్లకే ఫ్యామిలీ మొత్తం అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయింది. కౌంటీల్లో షకిబ్ ఆడే టైంలో శిశిర్ తో పరిచయమైంది. చదువుకోవటానికి వచ్చిన ఆమెతో మనోడి లవ్ ట్రాక్ నడిపి.. మూడేళ్ల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పెళ్లి అయ్యే వరకూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉన్న శిశిర్.. పెళ్లి తర్వాత మాత్రం మోడల్ గా మారారు.
ఇక.. ఈ ఇద్దరి జోడీ అదిరేలా ఉండటంతో వారికి యాడ్స్ లో మాంచి డిమాండ్ ఉంది. ఈ ఇద్దరూ జంటగా బోలెడన్ని యాడ్స్ లో నటించారు. బంగ్లాదేశ్ లో వీరి యాడ్స్ కు మంచి ఆదరణ ఉంది. దీంతో.. వీరిని పెద్ద పెద్ద బ్రాండ్లు జంటగా కాంట్రాక్టులు చేసుకోవటం కనిపిస్తుంది.