కట్టుకున్న భార్యను కడతేర్చాలని మూడు సార్లు ప్రయత్నించిన ఆ భర్త ఫెయిల్ అయ్యాడు. వ్యసనాలకు బానిస అయ్యి దారితప్పిన భర్త.. తన భార్య కూడా చెడిపోయిందని అనుమానించాడు. నిత్యం తాగొచ్చి ఆమెను చిత్రహింసలు పెట్టాడు.ఆమెను చంపేందుకు స్కెచ్ గీసి విఫలమయ్యాడు. చివరకు మానవమృగంలా మారి హతమార్చాలనుకున్నాడు. కానీ చేసిన పాపం అతడిని పట్టించింది.
ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరు మండలం కటకాడ పల్లెకు చెందిన శైలజకు రామిరెడ్డి పల్లెకు చెందిన రాజేంద్రాచారితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
వ్యసనాలకు బానిసైన రాజేంద్రాచారి నాలుగేళ్ల క్రితం వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రశ్నించిన భార్య శైలజను చిత్రహింసలు పెట్టేవాడు. భర్త వేధిస్తున్నా కొడుకు కోసం అన్ని భరిస్తూ వచ్చింది.
ఇక భార్య కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానించడం ప్రారంభించాడు. రెండు మూడు సార్లు ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. పురుగుల మందు తాగించినా బతికింది.
ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం భార్య గాఢనిద్రలోకి జారుకున్నాక చంపాలని డిసైడ్ అయిన రాజేంద్రనాథ్ పడుకున్నా భార్య పీకను కొరికేశాడు. దిండుతో ముఖాన్ని గట్టిగా అదిమిపట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శైలజ చనిపోయిందని భ్రమపడ్డాడు. దుప్పటితో చుట్టి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
తెల్లారి చిన్నారి ఏడుపులు విన్న చుట్టుపక్కల వారు తలుపులు పగులకొట్టి శైలజ అపస్మారక స్థితిలో ఉండడం చూశారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. భర్త రాజేంద్రచారిపై కేసు నమోదు చేసి అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక తండ్రి జైలుకు పోవడం.. తల్లి ఆస్పత్రి పాలు కావడంతో ఆ కుమారుడు దీనంగా ఏడ్వడం అందరినీ కలిచివేసింది.