ఏపీలో స్థానిక ఎన్నికలు ఎంత ఉత్కంఠ మధ్య జరిగాయో చెప్పక్కర్లేదు. యేడాది క్రితం నుంచే అధికార వైసీపీ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఎత్తులు - పై ఎత్తులతో దోబూచులాడుతూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టకేలకు పంచాయతీలు - పుర పాలక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పుడు మిగిలిందల్లా ఎంపీటీసీ - జడ్పీటీసీల ఎన్నికలే. ఎలాగైనా నిమ్మగడ్డ ఉండగా స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని జగన్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఓ అడుగు వెనక్కు తగ్గి చివరకు ఎన్నికలకు వెళ్లక తప్పలేదు.
ఎన్నికల విషయంలోనూ..ఏర్పాట్లు - ఏకగ్రీవాలతో పాటు ఇతర దౌర్జన్యాల విషయంలో ఎంతో కఠినంగా ఉన్నట్టు కనిపించిన ఎస్ ఈసీ నిమ్మగడ్డ ఓ విషయంలో మాత్రం ఫెయిల్ అయినట్టే అనిపించింది. సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ - లోక్ సభ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు పట్టుబడతాయి. ఎన్నికల సమయంలో పోలీసులు - ఇతర అధికార యంత్రాంగం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అభ్యర్థులు డబ్బు పంపకాలు విషయంలో చాటు మాటుగా పూర్తి చేసేస్తారు. అయినా అధికారులకు కొందరు దొరికిపోక తప్పదు.
అయితే తాజా పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఏపీలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగినా ఎన్నికల కమిషన్ ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టినట్టు లేదు. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లోనే విపక్ష టీడీపీ ఓటుకు రు. 500 నుంచి రు. 1000 వరకు పంపిణీ చేశారట. అధికార వైసీపీ డిమాండ్ ను బట్టి రు. 2000 - 4000 వేల వరకు కూడా పంచారట. వైసీపీ అధికారంలో ఉండడంతో తాము గెలిస్తే నిధులు - ఇతర పనుల విషయంలో తమకు తిరుగు ఉండదనే వైసీపీ నేతలు చిన్న చిన్న పంచాయతీలకు సైతం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇంత ధనప్రవాహం జరిగినా ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణపైనే దృష్టి పెట్టి ఈ విషయాన్ని గాలికి వదిలేసినట్టే కనిపించింది.
డబ్బుల పంపిణీలో కమ్యూనిస్టులు మినహా ... మిగిలిన పార్టీలు స్పీడ్ గానే ఉన్నాయి. ఏదేమైనా ఎన్నికల సంఘం ఈ విషయంలో సీరియస్‌గా దృష్టి పెట్టకపోవడంతో డబ్బులతో ఓట్లు కొనే సంస్కృతికి మరింత ఊతం ఇచ్చినట్లయ్యింది.