మంత్రాలకు చింతకాయలు రాలతాయా? పోనీ మంత్రాలకు.. ఉన్న డబ్బు రెండింతలు అవుతుందా? కానే కాదు! పోనీ చనిపోయిన తర్వాత నేరుగా దేవుడి దగ్గరకు పంపించేస్తామంటే నమ్మగలరా? ఇలాంటి మాటలతో మాయ చేసి.. మస్కా కొట్టి అందినకాడికి దోచుకునే బురిడీ బాబాలను నమ్మవద్దని ఎంతలా ప్రచారం చేస్తున్నా.. నమ్మి మోసపోయి తమ దగ్గరున్న డబ్బుల్ని ముట్టజెపుతున్న వారు లేకపోలేదు. ఇలాంటి బురిడీ పీర్ బాబా వలలో పడిన ముస్లిం కుటుంబం ఇప్పుడు లబోదిబోమంటోంది. అంతేగాక ఆ నకిలీ పీర్ బాబా - ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన సంఘటన వరంగల్ లో జరిగింది.
హన్మకొండ జులైవాడకు చెందిన ఖామోయినొద్దీన్ వరంగల్ ఎన్ ఐటీలో ఎంటెక్ పూర్తిచేసి 2009లో ఉద్యోగం నిమిత్తం దబాయ్ కి వెళ్లాడు. ఆ తర్వాత శంభునిపేటకు చెందిన ఆయన వదిన ద్వారా సయ్యద్ మస్తాన్ అలీ అలియాస్ అర్మానీ బాబా అలియాస్ పీర్ బాబాతో ఆయనకు పరిచయమైంది. మహారాష్ట్రకు చెందిన మస్తాన్ వలీ పదేళ్లుగా వరంగల్ లో ఉంటున్నాడు. ఎవరైనా చనిపోతే తన మంత్రశక్తితో వారిని నేరుగా దేవుడి దగ్గరకు పంపిస్తానంటూ మాయ మాటలు చెప్పడం ప్రారంభించాడు నకిలీ పీర్ బాబా!! ధర్మసాగర్ మండంలోని ఓ గ్రామంలో దర్గా కడుతున్నానని, ప్రహరీకి డబ్బు సహాయం చేయాలని వల వేశాడు. ఇలా చేస్తే ప్రమోషన్ తో పాటు మూడు రెట్లు డబ్బు అధికం అవుతుందని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన ఖామోయినొద్దీన్ దుబాయ్ నుంచి రూ. 50 వేలు పంపించాడు.
దుబాయ్ లో కంటే తనవద్ద ఉంటే.. స్వర్గం చూపిస్తానని ఖాజాను 2013లో వరంగల్ కు రావాలని చెప్పాడు. ఎంత డబ్బు ఇస్తే అంతకు రెట్టింపు చేసి ఇస్తానని ముగ్గులోకి లాగాడు. ఇది నమ్మిన ఖాజా కుటుంబ సభ్యులు 2013 నుంచి ఇప్పటి వరకు రూ. 14 లక్షలు ముట్టజెప్పారు. ఒకమారు రూ. 50 మే, మరోమారు రూ. 2 లక్షలు, మరోమారు రూ. 8 లక్షలు, చివరగా జెన్‌కోలో ఏఈ ఉద్యోగం ఇప్పిస్తానంటే రూ. 3.50 క్షు ముట్టజెప్పినట్లు చెప్పారు. ఇవే కాకుండా తన దర్గా పక్కన వ్యవసాయ భూమి ఉందని, రూ. 11 క్షు ఇస్తే భూమి కొనిస్తానని నమ్మించాడు. దీంతో ఖాజా రూ. 11 లక్షలు కూడా ఇచ్చాడు. కానీ, భూ యజమాని బూర అశోక్ గౌడ్ భూమిని బాబా పేరు మీద నోటరీ చేయించాడు.