" 'తాయత్తు కట్టుకుంటే మంచి జరుగుతుందన్న ఆశ.. పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందన్న భయం'..... 'నర బలిస్తే నిధులు దొరుకుతాయన్న ఆశ.. ఓ స్త్రీ రేపు రా అని తలుపు మీద లేకపోతే దెయ్యం వస్తుందన్న భయం'.... 'మంచి జరుగుతుందన్న ఆశ.. చెడు జరుగుతుందన్న భయం మనిషి ని దేన్నైనా గుడ్డిగా నమ్మేలా చేస్తాయి' "......... అని ఓ సినిమాలో హీరో చెప్పినట్టు మనుషుల నమ్మకాన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తూ జనాలను మోసం చేస్తున్న వాళ్లెందరో. అందులో నంబర్ వన్ ప్లేస్లో ఉంటారు డమ్మీ బాబాలు.
మనుషుల్లో భయాన్ని.. వారి నిస్సహాయతను అవకాశంగా మలుచుకుని దారుణమైన మోసాలకు.. ఆకృత్యాలకు పాల్పడుతున్న బాబాలెందరో.. మోసం చేయడమే కాకుండా కొన్నిసార్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న కేసులూ చూశాం. కానీ ఓ బాలిక నిస్సహాయతను.. ఆమె అమాయకత్వాన్ని అవకాశంగా మలుచుకుని ఓ బురిడీ బాబా ఆమెను చిత్రవధ చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల-వెంకటయ్య దంపతుల కుమార్తె(17) అశ్విని. ఈమె వికారాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కొన్నిరోజులుగా అశ్విని అనారోగ్యానికి గురైంది. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా.. ఎందరు డాక్టర్లకు చూపించినా.. ఆమె వ్యాధి ఏంటో తెలియడం లేదు. ఎన్ని మందులు వేసుకున్నా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఆడుతూ పాడుతూ తిరిగే వయస్సులో మంచాన పడిన కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండె బరువెక్కింది.
ఏం చేస్తే తమ కూతురు ఆరోగ్యం కుదుటపడుతుందోనని ఆలోచిస్తున్న తరుణంలో నస్కల్ గ్రామానికి చెందిన వారి బంధువు ఓ బాబా గురించి చెప్పింది. తమ ఊరి దగ్గర రఫీ అనే ఓ బాబా ఉన్నాడని.. ప్రతి శుక్రవారం భూతవైద్యం చేస్తాడని చాలా మంది ఆయన దగ్గరకు వెళ్తుంటారని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది వారి బంధువు. తమ కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు.. 'ఎందరో డాక్టర్లకు చూపించాం. ఎంతో ఖర్చు చేశాం. ఇప్పుడు ఈ బాబా వద్దకు వెళ్తే ఏమవుతుంది. ఒకవేళ నిజంగానే నా బిడ్డకు తగ్గిపోతుందేమో' అని బాబా వద్దకు అశ్వినిని తీసుకువెళ్లారు.
ఈనెల 13న అశ్విని తల్లిదండ్రులు ఆమెను రఫీ బాబా(భూత వైద్యుడు) దగ్గరికి తీసుకెళ్లారు. బాలికను చూడగానే ఆ బాబా ఆమెకు దెయ్యం పట్టిందని చెప్పాడు. ఆ మాట విన్న ఆమె తల్లిదండ్రులు కంగుతిన్నారు. 'బాబా ఎలాగైనా నా బిడ్డను మీరే కాపాడాలి' అంటూ ఆ దొంగ బాబాను వేడుకున్నారు. వారి నిస్సహాయతను ఆసరా చేసుకుని.. వీరిని మరింత నమ్మించి వాళ్ల దగ్గరి నుంచి డబ్బు గుంజాలని చూశాడు. ఈ క్రమంలో ఆ బాలికను చిత్రవధకు గురి చేశాడు. అశ్వినిని నిప్పులపై నడిపించాడని.. ఆమె చేతులను నిప్పుతో కాల్చాడని.. తర్వాత ఆ బాలికపై కాళ్లు పెట్టి నిలుచున్నాడని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
నిప్పులపై నడవడంతో చేతులకు నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలైన అశ్విని 'అమ్మా.. అమ్మా..' అంటూ ఏడవడం ప్రారంభించింది. ఆమె తల్లి.. 'భయపడకమ్మా..బాబా నీకు నయం చేస్తార'ని ఆమెకు ధైర్యం చెప్పింది. కానీ అశ్విని పరిస్థితి విషమించి స్పృహ తప్పడం తో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం తమ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ రాములుకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాలిక ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆమె తల్లిదండ్రులను జరిగిన విషయం అడిగి తెలుసుకున్నారు. వెంటనే నకిలీ బాబా రఫీని బుధవారం రాత్రి అరెస్టు చేశారు.
సాధారణంగా లాజిక్ కంటే మ్యాజిక్నే ఎక్కువ నమ్మే జనం.. ఇలాంటి దొంగ బాబాల మోసాలకు బలవుతున్నారని పోలీసులు అన్నారు. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రులకు వెళ్లాలి కానీ.. బాబాల వద్దకు కాదని సూచించారు. అమాయకులకు వల వేసి వారి భయాన్ని ఆసరాగా తీసుకుని వారి కష్టార్జితాన్ని లక్షల్లో దండుకుంటున్న రఫీ లాంటి బాబాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి వారిని నమ్మకూడదని చెప్పారు. ఎవరికైనా ఇలాంటి దొంగ బాబాల గురించి తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.