ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరు సరికొత్తగా వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఆయన పేరు మీద ప్రముఖులకు ఫోన్లు రావటం.. డబ్బులు పంపాలని కోరటం జరుగుతోంది. అలాంటి ఉదంతమే నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి ఫోన్ వచ్చింది. ఒక పేద యువతి వివాహం కోసం డబ్బులు పంపాలని మందకృష్ణ పేరుతో ఫోన్ కాల్ రావటం.. దానికి ఎమ్మెల్యే బదులిస్తూ.. సదరు జంటను తన దగ్గరికే పంపాలని.. తానే పెళ్లి చేస్తానని చెప్పినట్లుగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
అయినప్పటికీ.. విడవకుండా 15 సార్లు ఫోన్లు చేశారని.. చివరకు మందకృష్ణకు ఫోన్ చేయగా.. తాను ఎవరిని డబ్బులు అడగలేదని.. తన పేరు మీద ఎవరు ఫోన్ చేశారో తనకు తెలీదని.. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన చెప్పినట్లుగా ఎమ్మెల్యే సునీత పేర్కొన్నారు. తమ నాయకుడి పేరును ఈ విధంగా బద్నాం చేయటం ఏమిటన్న ఆవేదనతో పాటు.. తమ నేత పేరు మీద ఫోన్లు చేస్తున్నది ఎవరన్న విషయాన్ని పోలీసులు తేల్చాల్సిందిగా మందకృష్ణ ఫాలోయర్స్ కోరుతున్నారు.