చైనాను షేక్ చేస్తున్న ఫేక్ కోవిడ్ వ్యాక్సిన్లు..!

Update: 2023-01-09 08:00 GMT
కరోనా పుట్టినిల్లు చైనాలో ఆ మహమ్మారి మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్ సహా మరో రెండు వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనాను కట్టడి చేయాలని చైనా ప్రభుత్వం ప్రజల ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ 7న జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసింది. దీంతో గత కొన్ని రోజులుగా కోట్లాది మంది చైనీయులు కరోనా బారిన పడుతున్నారు.

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. రోగులకు కనీసం బెడ్ల దొరకని పరిస్థితి ఉండటంతో సెలైన్లు పెట్టుకుని మరీ కార్లలో తమ వంతు వచ్చేవరకు వేచి చూస్తారని తెలుస్తోంది. కరోనా మరణాలను చైనా అధికారికంగా వెల్లడించనప్పటికీ శ్మశాన వాటికల్లో మృతదేహాలతో నిండి పోతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులు చైనీయులు ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ బ్యాక్ మార్కెట్లో కొనుగోలు చేసి ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తున్నారు. దీంతో చైనాలో కోవిడ్ వ్యాక్సిన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వీటిని క్యాష్ చేసుకునే పనిలో కొందరు మధ్య దళారులు ఒక్కొక్కరిని నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.

బ్రతికుంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని ప్రజలు భావిస్తుండటంతో వ్యాక్సిన్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈక్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో చైనీయులు కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీటికి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కొందరు భారత్ వ్యాక్సిన్ల పేరుతో నకిలీలు అమ్ముతుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది.

ఇక భారత్ తయారు చేసిన వ్యాక్సిన్లు కరోనాపై పూర్తిగా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనీయులు భారతీయ జనరిక్ మందులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాక్స్‌లోవిడ్ బాక్స్‌లు చైనా బ్లాక్ మార్కెట్‌లో 50,000 యువాన్లకు అమ్ముడవుతున్నాయి.ఈ నేపథ్యంలో  చాలా మంది చౌకైన ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు.

ఈ పరిస్థితి భారతీయ తయారీదారులచే ఉత్పత్తి చేయబడిన జెనరిక్ వెర్షన్‌లకు డిమాండ్‌ను పెంచుతోంది. ప్రిమోవిర్.. పాక్సిస్టా.. మోల్నునాట్.. మోల్నాట్రిస్ వంటి మందులు అమ్మకానికి జాబితా చేయబడ్డాయి. అయితే ఈ నాలుగు ఔషధాలు భారత అధికారులచే అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించబడ్డాయి. వీటిని చైనాలో ఉపయోగించడం చట్టబద్ధం కాదు.

ఈ నేపథ్యంలోనే వీటిని కొందరు చైనాలో బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. అయితే డిమాండ్ కారణంగా లేబుల్స్ మారుస్తూ భారత వాక్సిన్ల పేరుతో నకిలీలను సైతం అమ్ముతున్నారని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నకిలీ మందులు వాడటం కరోనా పేషంట్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్లను వినియోగించాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News