అమెరికా అధ్యక్ష బరిలోని వ్యక్తిగా కంటే... మహిళలను లైంగికంగా వేదించాడనే విమర్శలతోనే ఫుల్ ఫేమస్ అయిపోయారు ట్రంప్. ఈ విషయంలో గత రెండు మూడు వారాలుగా ఒక్కో మహిళా మీడియా ముందుకు రావడం, ట్రంప్ తో వారికెదురైన అనుభవాలను చెప్పడం జరుగుతూనే ఉంది. అయితే ఆ విషయాలు మీడియాలో ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో ట్రంప్ లాంటి వ్యక్తి మోడల్స్ తో అమెరికా వీధుల్లో హల్ చల్ చేశాడు. ట్రంప్ పై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో, అలాంటి పనులన్నీ చేస్తూ సందడి చేశాడు.
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సొంత ఊరు న్యూయార్క్. అక్కడి మాన్ హట్టన్ వీధుల్లో ట్రంప్ పేరుమీద ట్రంప్ టవర్స్ - ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ లాంటి ఎన్నో వ్యాపారకేంద్రాలున్నాయి. ఆ ప్రదేశంలో తాజాగా నకిలీ ట్రంప్ హల్ చల్ చేశాడు. పదుల సంఖ్యలో మోడల్స్ వెంటరాగా అచ్చం ట్రంప్ లాంటి హెయిర్ స్టైల్, హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పనికి పూనుకుంది బ్రిటన్ కు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ అలిసన్ జాక్సన్.
స్పూప్ ఫొటోగ్రాఫర్ గా వరల్డ్ ఫేమస్ అయిన అలిసన్ జాక్సన్... సెలబ్రిటీలను పోలీనవ్యక్తులను వెతికిపట్టుకుని ఫొటో ఆల్బమ్స్ రూపొందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా డోనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఆల్బంను కూడా తయారుచేసింది. చికాగోకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి ట్రంప్ లా కనిపిస్తాడు.. హావభావాలనూ ప్రదర్శిస్తూంటాడు. దీంతో ఆ వ్యక్తితో ఈ ఫోటోగ్రాఫర్ ట్రంప్ పై వస్తోన్న ఆరోపణల్లాంటి ఫోటోలను తీసారు. త్వరలోనే ఈ ఆల్బం ప్రదర్శన ప్రారంభంకానుంది. అలా అని ఇదేమీ ఎన్నికల ప్రచారం కాదు సుమా... ఆమె వ్యక్తిగత హాబీ కి సంబందించిన అంశమట!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/