ఫేక్ ఐపీఎల్.. గల్లీ క్రికెట్ తో రష్యన్లతో బెట్టింగ్.. లక్షలు కాజేశారిలా!
ఐపీఎల్ ముగిసింది. కానీ ఆ బెట్టింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఫేక్ ఐపీఎల్ సృష్టించి దోచుకున్నారు. ఫేక్ క్రికెట్ టోర్నమెంట్ అని పోలీసులు గుర్తించారు. అది భారత్ లోని ఏదో మారుమూల ప్రాంతంలో జరుగుతున్న 20-20 క్రికెట్ మ్యాచ్ వీడియో రికార్డు చేసి నమ్మించారు. గుజరాత్ లోని నిరుద్యోగ యువత, రష్యాకు చెందిన గ్యాంబర్లు దీన్ని నడిపిస్తున్నారని వెల్లడించారు.
ఇలాంటి నకిలీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నడిపిస్తున్నారని గత వారం మెహససా జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు సోషల్ మీడియా యాప్ ‘టెలిగ్రామ్’ ద్వారా రష్యాలోని మూడు నగరాలకు చెందిన గ్యాంబర్ల నుంచి బెట్టింగ్ స్వీకరించారని సమాచారం. ఈ కేసుపై విచారణ చేపడుతున్న అధికారి భవేశ్ రాఠోడ్ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం అరెస్ట్ అయిన నలుగురిలో ఒక నిందితుడు శోయబ్ దావ్డా రష్యాలోని ఒక పబ్ లో పనిచేశాడు. అక్కడి వ్యక్తులతో ఇతడికి సంబంధాలున్నాయి. వారికి క్రికెట్ బెట్టింగ్ లో ఆసక్తి ఉందనే విషయాన్ని అతడు గ్రహించాడు. దీంతో ఇలాంటి ఫేక్ క్రికెట్ లీగ్ ప్రారంభించాడు అని తెలిపారు.
భారత్ లో ఏటా ఐపీఎల్ నిర్వహిస్తుంటాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్.. ఇదే తరహాలో తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా సొంతంగా లీగ్ లు మొదలుపెట్టాయి. భారత్ లో గుర్రపు పందేలు మినహా స్పోర్ట్స్ బెట్టింగ్ లకు చట్టాలు అనుమతించవు. అయితే చాలా చోట్ల అక్రమంగా బెట్టింగ్ సాగుతోందని పోలీసులు చెబుతున్నారు.
మెహసానాలో బయటపడ్డ మ్యాచ్ లు ఫేక్ లీగ్ లు. పూర్తిగా గ్యాంబ్లింగ్ కోసమే నిర్వహిస్తుంటారు. ఈ మ్యాచ్ లను ఆర్గనైజర్లు లైవ్ ఇస్తుంటారు. వీటిలో అంపైర్లు బహిరంగంగానే ప్లేయర్లకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అదంతా బెట్టింగ్ కోసం నిర్వహిస్తున్న ఫేక్ పోటీలు అని ఐపీఎల్ మాజీ డైరెక్టర్లు తెలిపారు.
ఇప్పటికే 9 మ్యాచ్లులు ఆడిన తర్వాత మెహసానా టోర్నమెంట్ ను పోలీసులు పట్టుకోగలిగారు. ఒక మారుమూల గ్రామంలో ఈ మ్యాచ్ లు ఆడుతున్నట్లు వారు చెప్పారు. క్రికెట్ కిట్ లు, కెమెరాలు, స్పీకర్లను నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ స్పీకర్ల సాయంతో రన్నింగ్ కామెంటరీలు పెట్టేవారని పోలీసులు తెలిపారు.మొత్తంగా బెట్టింగ్ కోసం ఏకంగా గ్రామంలో మ్యాచ్ లు నిర్వహించడం సంచలనమైంది.