సినిమాల్లో కనిపించే సీన్ ఒకటి ఆవిష్కృతమైంది. రీల్ లో బోల్తా కొట్టించే నకిలీ అధికారులు రియల్ గా అమ్మ మేనకోడల్ని హడలెత్తించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లుగా వచ్చిన వార్తలు షాకింగ్ మారాయి. ఐటీ సోదాలు చేసేంత సినిమా దీపకు ఉందా? అన్న సందేహం పలువురికి కలిగింది.
అయితే.. పార్టీ పదవులు అమ్ముకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తాజా సోదాలు నిర్వహించినట్లుగా భావించారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్ట్ ఒకటి ఉంది. అదేమంటే.. సినిమాల్లో మాదిరి ఒక నకిలీ గ్రూప్ ఐటీ అధికారుల పేరుతో దీప ఇంటికి సోదాలు చేపట్టారు.
పెద్ద ఎత్తున నగదు.. బంగారాన్ని దోచుకోవచ్చన్న ఆలోచనతో పక్కా స్కెచ్ వేసుకున్న వారు.. దీప ఇంటికి వచ్చి ఐటీ అధికారులుగా హడవుడి అయితే చేయగలిగారు. అయితే.. వీరి తీరు తేడాగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. తమ గుట్టు రట్టు అయిపోతుందన్న విషయానని గుర్తించిన నకిలీ ఐటీ అధికారులు పలాయనం చిత్తగించారు.
ఒక ప్రముఖురాలి ఇంటికి అంత ధైర్యంగా రావటం ఆసక్తికరంగా మారింది. ఈ నకిలీ ఐటీ అధికారుల సంగతి చూసేందుకు పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.