పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదా అయినప్పటికీ ఈ అంశంపై బురద జల్లే కార్యక్రమం మొదలయ్యాయి. దాన్ని ఇసుక తుపానుతో కప్పేయాలన్న ప్రయత్నాలూ మొదలయ్యాయి. రివర్స్ లో ఆదా అయ్యే మొత్తం కన్నా ఇసుక కారణంగా అదనపు భారం పడుతుందంటూ బురదజల్లే కుతంత్రాలు మొదలయ్యాయి. తమ వారికి దక్కలేదన్న అక్కసు పచ్చ మీడియాలో పడగలెత్తుతున్నది. ఎలాగైన రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలవరం నిర్మాణ బాధ్యతలను తక్కువ ధరకే భుజానకెత్తుకున్న కంపెనీని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు ఊపందుకున్నాయి.
పోలవరం రివర్స్ టెండర్ డాక్యుమెంట్ లో ఇసుకకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా కొత్త కాంట్రాక్టర్ కూ అలాంటి విధానాన్నే అనుసరిస్తే ఫర్వాలేదు. కానీ ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించింది. అందులోనూ ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి వివరణ లేదు. ఈ నేపథ్యంలో ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితి వస్తే అందుకు అదనంగా చెల్లింపులు జరపాలంటూ టెండర్ బిడ్ దాఖలు చేసిన కొత్త కాంట్రాక్టర్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
లేదా పాత విధానాన్నే అవలంభించాలంటూ లేఖలో పేర్కొంది. టెండర్ లో కూడా పాత కాంట్రాక్టర్ నవయుగ ఇంజినీరింగ్ కి వర్తించిన షరతులు వర్తింప చేయాలని ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపుగా 60 లక్షల టన్నుల ఇసుక అవసరం అవుతుంది. ఇందుకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధర టన్నుకు 378 రూపాయల చొప్పున మొత్తం సుమారుగా రూ. 220 కోట్లు అవుతుంది. కానీ.. పచ్చ మీడియా మాత్రం ఆమాంతంగా తమ చేతి వాటాన్ని ప్రదర్శించి రూ. 500 కోట్లకు పెంచేసింది.
ఇక, టెండర్ లో పేర్కొన్న పనులను 12.6 శాతం తక్కువ ధరకు చేస్తామంటూ కొత్త కాంట్రాక్టర్ ఒక్కటే బిడ్ ను దాఖలు చేసింది. అలాగే టెండర్ లో పేర్కొనని పనులేవైనా సరే అదనపు చెల్లింపులు ప్రస్తుత ధరలకు అనుగుణంగా జరపడం అన్ని ప్రభుత్వం పనుల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ సహజం. ఇందులో ఎక్కడా పారదర్శక లోపించిన దాఖలాలు లేవు.
ఇసుక విధానంలో ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు ఎలాంటి వివరణలు లేవు. ప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానంలో పొందుపరిచిన రేట్లు, ఇసుక విధానం అమలులోకి వచ్చిన తర్వాత వేసిన అన్ని అంచనాలకు వర్తిస్తాయని గత నెల 25న ఇంజినీర్ ఇన్ ఛీఫ్ కే శ్రీనివాస్ బోర్డ్ ఆఫ్ ఛీఫ్ ఇంజినీర్స్ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందులోని అంశాల ఆధారంగానే కొత్త కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఇసుకకు సంబంధించిన ప్రతిపాదనలను పంపించింది.
అయితే గతంలో నవయుగకు ఇచ్చిన రాయితీలనే కొనసాగించేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో అదనంగా ప్రభుత్వంపై భారం పడే అంశం ఏదీ లేదు. జాతీయ ప్రాజెక్టుకోసం కూడా ఇసుకను కొనుగోలు చేయడమా? లేదా మినహాయింపు ఇస్తారా? అన్న అంశాలు ఏవీ తేలకుండానే ఆదా రివర్స్ అంటూ ప్రచారానికి కొన్ని పత్రికలు దిగాయి. ఇసుక కొరతను ఎలాగైనా సరే ప్రభుత్వ ప్రాజెక్టులకూ ముడిపెడుతూ వాస్తవ విరుద్ధ ప్రచారాలకు పూనుకుంటున్నాయి.