నవ్యాంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల శోభ తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో కలకలం రేగింది. దేశ - విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు కీలక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధులు హాజరైన భాగస్వామ్య సదస్సులో యంత్రాగాన్ని కలవరపెట్టేలా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయి. సదస్సుకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసిన్నట్టు పోలీసు అధికారులు చెప్పుకొచ్చినప్పటికీ రెండో రోజు చోటుచేసుకున్న ఘటనలతో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది.
అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న ప్రాంగణం వద్ద పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు దారితీసే మార్గాన్ని దిగ్బంధనం చేసి, వీఐపీలకు సంబంధించినవి మినహా ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. అయితే సదస్సు రెండో రోజు ఓ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గా చెప్పుకుంటూ నేరుగా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. సమావేశాలు జరుగుతున్న హాల్ 1, 2, 3ల్లోకి ప్రవేశించి, అక్కడ్నుంచి నేరుగా సీఎం విడిది చేసే చాంబర్ లోకి చేరుకున్నాడు. సుమారు రెండు గంటల పాటు అజ్ఞాత వ్యక్తి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతంలో సంచరించినప్పటికీ ఎవరికీ ఎటువంటి అనుమానం కలగలేదు! అయితే అజ్ఞాత వ్యక్తి రెండోసారి సీఎం చాంబర్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, అక్కడున్న భద్రతా సిబ్బంది అనుమానించి ప్రశ్నించారు. దీంతో బండారం బయటపడింది. ఇదిలాఉండగా సదస్సు జరుగుతున్న ప్రాంగణంలోకి రెండో రోజు ఓ వ్యక్తి పోలీసు యూనిఫాంలో ప్రవేశించాడు. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది నకిలీ పోలీసును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ రెండు ఘటనలతో సీనియర్ పోలీసు అధికారులతోపాటు సీఎం, ఇతర మంత్రులు ఉలిక్కిపడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోనప్పటికీ ఒక అనామకుడు భాగస్వామ్య సదస్సు కీలక వేదికల వద్ద కలియతిరగడం, సాక్షాత్తూ సీఎం చాంబర్ లోకి సైతం సునాయాసంగా ప్రవేశించడంతో భద్రతా సిబ్బంది కలవరపాటుకు లోనయ్యారు. పోలీసు విచారణతో అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమేష్ నాయుడుగా తేలింది. గతంలో పలు మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ పోలీసుపై విచారణ చేపడుతున్నారు.