కొత్త న‌కిలీ నోట్ల‌తో పాక్ కుట్ర మొద‌లైంది

Update: 2017-02-14 05:11 GMT
పొరుగునే ఉన్న‌ప్ప‌టికీ మన దేశాన్ని తీవ్ర ముప్పుతిప్ప‌లు పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేసే పాకిస్తాన్ ఇపుడు మ‌న ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించాలనే దుర్బుద్ధితో నకిలీ నోట్ల తయారీ చేసింది. బంగ్లాదేశ్ మీదుగా ఇండియాలోకి నకిలీనోట్లు పంపిస్తోంది. భారత-బంగ్లా సరిహద్దుల్లో నకిలీ నోట్లను - వాటిని తెచ్చిన వారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ ఐఏ) - బీఎస్‌ ఎఫ్ పట్టుకుంది. ఈనెల 8న ముర్షిదాబాద్‌ లో అజీజుర్ రెహమాన్(26) అనే వ్యక్తి పట్టుబడ్డాడు. పశ్చిమ బెంగాల్‌ లోని మాల్దాకు చెందిన ఆ యువకుని వద్ద రూ.2000 విలువ గల 40 నకిలీనోట్లు దొరికాయి. ఆ నోట్లు పాక్‌ లో ఆ దేశ గూఢచార సంస్థ(ఐఎస్‌ ఐ) సహాయంతో ముద్రించినవని నిందితుడు తెలిపాడు.

రూ.2000 విలువ గల ఒక్కొక్క నకిలీ నోటును మార్చడానికి, వాటి నాణ్యత ఆధారంగా స్మగ్లర్లు రెహమాన్ వంటి వారికి రూ.400 నుంచి రూ.600 అసలు కరెన్సీని కమీషన్ కింద చెల్లిస్తున్నారు. అసలు రూ. 2000 నోటు లో 17 రకాల భద్రతా గుర్తులుంటే వాటిలో 11 గుర్తులు నకిలీ నోట్లలోనూ ఉంటున్నాయని నిపుణులు, దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. పాకిస్థాన్ దుర్బుద్ధి మరోమారు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, గ‌త ఏడాది బెంగ‌ళూరుకు చెందిన న‌లుగురు వ్య‌క్తులు న‌కిలీలు సృష్టించ‌డ‌మే కాదు.. వాటిని కొన్ని షాపుల్లో వాడారు. బెంగ‌ళూరుకు చెందిన‌ శ‌శాంక్, మ‌ధుకుమార్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు కొత్త 2000 నోటును జిరాక్స్ మెషీన్ ఉప‌యోగించి కాపీ చేశారు. ఆ త‌ర్వాత దానిని కరెక్ట్ సైజుకు క‌ట్ చేశారు. ఓ మెరుపు పెన్ను సాయంతో మ‌ధ్య‌లో ఉండే ఆకుప‌చ్చ రంగు గీత గీశారు. ఆ న‌కిలీ నోటునో ఓ షాప్ య‌జ‌మాని అనుమానించి పోలీసుల‌కు స‌మాచార‌మివ్వ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌మ ఫ్రెండ్ షాపులో ఉన్న ఓ జిరాక్స్ మెషీన్‌ లో మొదట 25 న‌కిలీ నోట్ల‌ను వీళ్లు సృష్టించారు. ఈ నకిలీ నోట్లు త‌యారుచేసిన‌వారిలో ఒక‌రు మెకానిక్ కాగా.. మరొక‌రు ఆటో డ్రైవ‌ర్!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News