మరో దొంగ స్వామీజీ గుట్టు రట్టు అయ్యింది. ప్రజల నమ్మకాల్ని ఆసరాగా చేసుకొని ఎంతలా మోసం చేస్తారన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ స్వామీజీ ఉదంతాన్ని చెప్పక తప్పదు. మాయమాటలు చెప్పి డబ్బులు దండుకోవటంతో ఒక ఎత్తు.. నమ్మకం మాటున దొంగ మాటలతో మహిళల్ని లోబర్చుకునే కళను కొందరు స్వామీజీలు ప్రదర్శిస్తుంటారు.
తాజాగా అలాంటి తీరునే ప్రదర్శిస్తూ.. పలువురు మహిళల్ని లొంగదీసుకున్న దొంగ స్వామీజీ గుట్టు రట్టు అయ్యింది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన శ్రీకాంత్ స్వామీకి స్థానికంగా స్వామీజీ అన్న పేరుంది. అయితే.. అతగాడి తీరు చాలా అనుమానాలకు తావిచ్చేలా ఉంటుంది.
అమాయక ప్రజల నమ్మకాల్ని అసరాగా చేసుకొని పలువురు మహిళల్ని లొంగదీసుకోవటం.. వారి బలహీనతలతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించే వాడు. తాజాగా అయ్యగారి రాసలీలలకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ గా మారిన ఈ ఫోటోల్ని చూసిన పోలీసులు రంగంలోకి దిగారు. స్వామీజీని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. పెద్ద బొట్టు పెట్టుకొని మంత్రాలు చదువుతూ.. హడావుడి చేసే స్వామీజీలోని రొమియోను బయటకు తెచ్చిన ఫోటోలతో.. అయ్యగారి తెర వెనుక భాగోతాల్ని బయటకు తీసుకొచ్చే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. దొంగస్వామి కారణంగా మోసపోయిన మహిళలు.. తమ ఫోటోలు బయటకు రావటంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.