ఫేక్ వ్యాక్సినేషన్.. ఆ రెండు రాష్ట్రాల్లోనేనా?

Update: 2021-06-25 01:30 GMT
మ‌హారాష్ట్రలో వెలుగు చూసిన ఫేక్ వ్యాక్సినేష‌న్ అంశం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ముంబైలోని ఓ హౌసింగ్ సొసైటీలో బ‌య‌ట‌ప‌డిన ఈ వ్య‌వ‌హారం.. ఆ త‌ర్వాత చాలా మంది బాధితుల‌ను బ‌య‌ట‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌క‌పోవ‌డం.. కొవిన్ యాప్ లో కూడా వీరి పేర్లు రిజిస్ట‌ర్ కాక‌పోవ‌డంతో ఈ ఫేక్ వ్యాక్సిన్ బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

దీంతో.. వారికి టీకా వేశారా? సెలైన్ వాటర్ ఎక్కించారా? అనే సందేహం కూడా వ్య‌క్తమైంది. ఫ‌లితంగా.. ఈ వ్య‌వ‌హారం న్యాయ‌స్థానం వ‌ద్ద‌కు చేరింది. పోలీసులు కూడా విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 2 వేల మందికి పైగా ఫేక్ వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురిని అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఇంకా మ‌రికొంద‌రి హ‌స్తం ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇదే త‌ర‌హా బాగోతం ప‌శ్చిమ బెంగాల్లోనూ వెలుగు చూసింది. సుమారు 300 మంది ఫేక్ వ్యాక్సినేష‌న్ బాధితులు ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. టీకా వేసుకున్న వారి నుంచి ఎలాంటి వివ‌రాలు తీసుకోక‌పోవ‌డం.. ధ్రువ‌ప‌త్రాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. ఈ కేసులో కోల్ క‌తా పోలీసులు ఒక‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. ఈ వ్య‌వ‌హారం ఈ రెండు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైందా? అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ మేర‌కు ఫేక్ వ్యాక్సిన్ జ‌రిగిందంటూ సోష‌ల్ మీడియాలోనూ ప‌లు వీడియోలు తిరుగుతున్నాయి. నిజంగా.. వ్యాక్సిన్ వేశారా? సెలైన్ వాటర్ వంటివి ఇచ్చారా? అన్న‌ది సామాన్యులు గుర్తించ‌డం అసాధ్యం. దీంతో.. వారు వేసిందే టీకా అన్న‌ట్టుగా మారిపోయింది ప‌రిస్థితి.

అయితే.. ఫేక్ వ్యాక్సినేష‌న్ ఒకెత్త‌యితే.. బాధితుల‌ను ఎలా గుర్తించాల‌నేది కూడా అంతు చిక్క‌కుండా ఉంది. ఎవ‌రికి న‌కిలీ ఇంజెక్ష‌న్ చేశారో.. ఎవ‌రికి స‌రైన‌ది చేశారో తెలియ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింది. అంతేకాదు.. వాళ్లు తిరిగి వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా? అనేది కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి.
Tags:    

Similar News