రోజులో అత్యంత సంపన్న మహిళగా ఫల్గుణి నాయర్ ఎలా మారగలిగారు?

Update: 2021-11-11 12:30 GMT
దేశీయంగా సంచలనంగా మారాయి ‘నైకా’ షేర్లు. ఈ షేరును నమ్ముకున్న వారి మీద లాభాల వర్షం కురిసింది. అంతేనా.. ఒక్కరోజులో నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా మారారు. ఇంతటి ఘన విజయం ఆమెకు ఎలా సాధ్యమైంది? ఆమె గతంలో ఏం చేసేవారు? ఇంతటి విజయాన్ని ఆమె ఎలా సాధించారు? అన్న విషయానికి వస్తే.. నైకా.. నైనా ఫ్యాషన్ అనేవి రెండు వ్యాపార విభాగాలు. బ్యూటీ.. పర్సనల్ కేర్.. ఫ్యాషన్ ఉత్పత్తుల్ని ఈ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా అమ్ముతుంటుంది. వీరు తాము సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు ఉంటాయి. కానీ.. అక్కడ దొరికే ఉత్పత్తులతో పోలిస్తే తక్కువనే మాట వినిపిస్తూ ఉంటుంది.

నైకా యాప్ సాధించిన ఘనతల్లోముఖ్యమైనది 2021 ఆగస్టు 31 నాటికి 5.58 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. గత సంవత్సరాల్లో ఆర్జించిన లాభాలతో పోలిస్తే.. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.61 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంకుర సంస్థల్లో చాలా వరకు నష్టాల్ని మూట కట్టుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా నైకా మాత్రం లాభాల్ని సొంతం చేసుకుంది.

ఇక.. ఈ సంస్థ వ్యవస్థాపకురాలైన ఫల్గుణి నాయర్ 2012లో నైకాను స్థాపించారు. ఆమె కోటక్ మహీంద్రా క్యాపిటల్ కు ఎండీగా వ్యవహరించారు. 2021 నవంబరులో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రాగా.. 81.87 రెట్ల స్పందన లభిస్తే.. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్ని విక్రయ కేంద్రాలు.. గిడ్డంగుల ఏర్పాటుకు.. రుణాల చెల్లింపునకు కంపెనీ వాడనుంది.

ఈ షేర్ స్టాక్ మార్కెట్ ను బుధవారం (నవంబరు 10న) నమోదైంది. ఇష్యూ ధరను రూ.1125గా నిర్ణయిస్తే.. ఇందుకు 77.86 శాతం పెరిగి రూ.2001కు టచ్ చేసి.. ఆ తర్వాత మరింత పెరిగి.. తగ్గి.. చివరకు రూ.2018 వద్ద ట్రేడింగ్ ను ముగించింది. దీంతో.. తొలి రోజే కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లను దాటేసి రూ.1,04,438.88 కోట్ల వద్ద స్థిరపడింది. ఈ సంస్థ వ్యవసాపకురాలైన ఫల్గుణి నాయర్ కు ఆమె కుటుంబానికి 54.22 శాతం షేరు ఉంది. షేర్ల ను అంకెల్లో చెప్పాలంటే సంస్థకు సంబంధించిన 2.53 కోట్ల షేర్లు ఉన్నాయి.

బుధవారం జరిగిన ట్రేడింగ్ పుణ్యమా అని ఆమె సంపద ఏకంగా రూ56 వేల కోట్లకు చేరుకుంది. దీంతో.. దేశంలోనే ఆమె అత్యంత సంపన్న మహిళగా తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బయోకాన్ ఛైర్ పర్సనర్ కిరణ్ మజుందార్ షా రూ.36వేల కోట్లతో ఉన్న ఆమె స్థానాన్ని అధిగమించి.. ఆమెకు అందనంత దూరానికి దూసుకెళ్లారు. ఫోర్బ్స్ భారత సంపన్నుల జాబితా ప్రకారం చూస్తే.. అత్యంత సంపన్నకుటుంబాల జాబితాలో ఉన్న ముత్తూట్.. మారికో.. ఏషియన్ పెయింట్స్.. కేడిలా హెల్త్ కేర్.. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కు చెందిన భాటియా కుటుంబాల కంటే కూడా ఇప్పుడు ఫల్గుణి ఫ్యామిలీనే అత్యంత సంపన్నులుగా మారారు.

ఇక.. దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూపునకు చెందిన సావిత్రి జిందాల్ గా చెబుతారు. అయితే.. ఆమె స్వయంగా ఈ ఘనతను సాధించలేదు. సావిత్రి జిందాల్ భర్త జిందాల్ గ్రూపును స్థాపించారు. ఆయన మరణించిన తర్వాత సావిత్రిజిందాల్ కంపెనీని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను పక్కన పెట్టి.. స్వయంశక్తితో ఎదిగిన సంపన్న మహిళను చూసినప్పుడు ఫల్గుణి నాయర్ నిలుస్తారు.
Tags:    

Similar News