టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డికి అవకాశం లభించనుందనే వార్తల నేపథ్యంలో ఆ అంశంపై కొంతమంది దుష్ప్రచారాన్ని సాగిస్తూ దుమారం రేపు ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి మతం విషయంలో తప్పుడు ప్రచారాన్ని సాగించి, ఆయన నియామకాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా, వికీపీడియాలను వాడేసుకొంటూ ఉన్నారు.
వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదని, ఆయన క్రిస్టియానిటీని స్వీకరించారని ఒక తప్పుడు ప్రచారాన్ని ఆన్ లైన్ వేదికగా కొంతమంది చేపట్టారు. అలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటంటూ.. దుష్ప్రచారం సాగిస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా వైవీ సుబ్బారెడ్డి వికీపీడియా పేజ్ లోకి వెళ్లి.. సుబ్బారెడ్డి మతం క్రిస్టియన్ అంటూ కొంతమంది ఎడిట్ చేశారు. తద్వారా దీన్ని వివాదంగా మార్చే ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు.
అయితే ఈ అంశంలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి ఎప్పుడూ క్రిస్టియన్ కాదు. ఆయన పుట్టింది హిందువుగానే, కొనసాగుతున్నది హిందూయిజంలోనే. సుబ్బారెడ్డి భార్య కూడా బార్న్ హిందూనే. మతం విషయంలో మార్పిడిలు గట్రా కూడా వారి కుటుంబంలో లేవని తెలుస్తోంది.
అయితే ఏదో ఒక వివాదాన్ని రాజేయాలని ప్రయత్నించే వాళ్లు.. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ను అడ్డం పెట్టుకుని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి.. జగన్ మీద బురద జల్లే ప్రయత్నం సాగిస్తూ ఉన్నారని తెలుస్తోంది.
అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ నియామకం విషయంలో వివాదాన్ని రేపడానికి ఇలా ట్రై చేశారని స్పష్టం అవుతోంది. సీఎం అయ్యాకా జగన్ ఎక్కడ దొరుకుతారా అని కొంతమంది ఎదురుచూస్తూ ఉన్నారు. దొరకకపోవడంతో ఇలాంటి దుష్ప్రచారం కూడా మొదలుపెట్టేసినట్టుగా తెలుస్తోంది.