తెలంగాణలో ముందస్తు ఎన్నికలలో చిత్రవిచిత్రాలు జరగనున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలలో కూడా అనేక చిత్రాలు చోటు చేసుకుండేవి. ఇప్పుడు మాత్రం తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చుట్టాల మధ్య ఎన్నికల పోరు జరుగుతోంది. తమ్ముడు తమ్ముడే....పేకాట పేకాటే అన్న చందంగా సుట్టం సుట్టమే.......పట్టం పట్టమే అన్నట్లుగా ఎన్నికల సరళి నడుస్తోంది. అన్నదమ్ములు చెరో పార్టీలోను చేరి ఎన్నికలలో పోటి చేస్తున్నారు. అక్క తమ్ముడు - వదిన మరిది..... తండ్రి కొడుకు........ఇలా బంధుత్వాలను పక్కన పెట్టి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రాజకీయ కురు వ్రుద్దినిగా పేరున్న డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన టీఆర్ ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్దమవుతున్నారు. ఆయన కుమారుడు డి. అర్వింద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఎన్నికలలో నిజామాబాద్ నుంచి ఆయన పోటి చేసే అవకాశం ఉందంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో పటోళ ఇంద్రారెడ్డి కుటుంబం రాజకీయంగా చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ కుటుంబం ఇంద్రారెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ లో చేరింది. ఇంద్రారెడ్డి భార్య సబిత కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రిగా చేసారు. ఇంద్రారెడ్డి మేనల్లుడు నరేంద్ర రెడ్డి తాజాగా కొడంగల్ నుంచి టీఆర్ ఎస్ నుంచి పోటి చేస్తున్నారు. అత్త - బావ కాంగ్రెస్ లో ఉంటే ఈయన మాత్రం టీఆర్ ఎస్ లో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటి చేయనున్నారు. శశిధర్ రెడ్డి కుమారుడు అదిత్య రెడ్డి తెలంగాణ జన సమితిలో చేరి రంగారెడ్డి జిల్లా తాండురు నుంచి ఆ పార్టీ తరఫున పోటి చేయనున్నారు. మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన డికె. అరుణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు. ఆమె తమ్ముడు చిట్టేం రామ్మోహన రెడ్డి మక్తల్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దిగా ఎన్నికల బరిలో ఉన్నారు. డికె. అరుణ మేనల్లుడు క్రిష్ణమోహన రెడ్డి కూడా టీఆర్ ఎస్ నుంచే పోటి చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కూడా ఎర్రబెల్లి కుటుంబంలో అన్నదమ్ములు వేరువేరు రాజకీయ పార్టీల నుంచి పోటి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. ఆయన సోదరుడు ప్రదీప్ రావు గతంలో ప్రజారాజ్యం నుంచి పోటి చేసారు. ఈ సారి జనసేన నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నట్టు సమాచారం. ఇలా తెలంగాణలో పలు రాజకీయ పార్టీలలో కుటుంబ సభ్యులే ఉండడం విశేషం. తమలో ఎవరు ఓడిన - ఎవరు గెలిచినా అధికారం మాత్రం కుటుంబం చేతుల్లోనే ఉంటుందని వీరి ఆలోచన.