స్థానిక ఎన్నికల్లో 100 సీట్లు గెలిచిన స్టార్ హీరో అభిమాన సంఘం

Update: 2021-10-14 14:30 GMT
తమిళనాడులో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సూపర్‌స్టార్ కమల్ హాసన్ మక్కల్ నీది మయం ఘోరంగా విఫలమైంది. సీట్లు సాధించలేక చతికిలపడింది. అదే సమయంలో యువ సూపర్‌స్టార్ అభిమాన సంఘం, తళపతి విజయ్ ఫ్యాన్ క్లబ్ ఏకంగా 100కి పైగా సీట్లను గెలుచుకొని సత్తా చాటింది. పార్టీ పెట్టకముందే.. పార్టీ లేకమునుపే ఒక ఫ్యాన్ క్లబ్ గా పోటీచేసి ఈ రేంజ్ లో సీట్లు సాధించడం సంచలనమైంది.

రాజకీయాల్లోకి రావడానికి తమిళ స్టార్ హీరో విజయ్ నిరాకరిస్తున్నారు. విజయ్ పేరుతో పార్టీ పెట్టి ముందుకెళ్లిన తల్లిదండ్రులపైనే కేసు పెట్టాడు. అతని తల్లిదండ్రులు ఎస్. చంద్రశేఖర్ -శోభా శేఖర్‌తో సహా 11 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు, అయితే తాజాగా తన ఫ్యాన్ క్లబ్ తో ఎన్నికల్లో పోటీ చేయడానికి తన అభిమానులను విజయ్ అనుమతించారు.

తమిళ సినిమాలో రజనీకాంత్ తర్వాత పాపులారిటీ రేటింగ్స్‌ లో రెండో స్థానంలో ఉన్న విజయ్ కు ఈ స్థాయిలో ఓట్లు, సీట్లు రావడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.  విజయ్  అభిమాన సంఘం ' ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఐయకం' తాజాగా జరిగిన తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో  తొమ్మిది జిల్లాల్లో సత్తా చాటింది. గ్రామీణ సంస్థల్లో పోటీచేయడానికి విజయ్ అనుమతించడంతో ఆయన అభిమానులు  మొదటిసారి పోటీచేశారు.

నటుడి ఫ్యాన్ క్లబ్.. ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన 169 సీట్లలో 115 గెలుచుకోవడం విశేషం. క్లబ్ జనరల్ సెక్రటరీ -కాంగ్రెస్ మాజీ పుదుచ్చేరి ఎమ్మెల్యే బుస్సీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏకంగా 13 సీట్లలో ఈ క్లబ్ పోటీదారులు ఏకగ్రీవంగా గెలిచారు. ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ 115 విజేతలలో 45 మంది మహిళలు, ఇతర విజేతలు రైతులు, ల్యాబ్ టెక్నీషియన్లు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాపారులు కూడా ఉన్నారని తెలిపారు.

ఆల్ ఇండియా తళపతి మక్కల్ అయ్యకం క్లబ్ లో 10 లక్షలకు పైగా నమోదిత సభ్యులు ఉన్నారు. అభిమానుల సంఘానికి సాధారణంగా రాజకీయ సంబంధాలు లేవు. 2011 ఎన్నికలలో తప్ప, విజయ్ అన్నాడీఎంకే , జయలలితకు మద్దతు అందించారు.  ఈ ఫలితాలు భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక పెద్ద పాత్ర కోసం విజయ్‌ని వెతుకుతాడని పలువురు రాజకీయ పండితులు విశ్వసిస్తున్నారు.

"పోటీకి దిగడానికి ముందు విజయ్ సరైన రీసెర్చ్ చేసాడు. అతను తన అభిమానులను తన పేరు -జెండాను ఉపయోగించడానికి అనుమతించాడు. తమిళనాడులో తన ప్రజాదరణను బట్టి అతను కొన్ని సీట్లు గెలుచుకోగలడని అతనికి తెలుసు.ఈ ఫలితాలు చూస్తే అతను రాజకీయాల్లోకి దూసుకుపోయే అవకాశం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ నాయకుల కొరత ఉందని.. హీరో విజయ్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక జనాల్లో ఉందని ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
Tags:    

Similar News