తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని చేసిన ప్రకటన అక్కడ రాజకీయంగా అలజడి రేపింది. ఆయన ప్రత్యర్థులు ఈ వార్త విని సంతోషపడగా.. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తపిస్తున్న ఆయన అభిమానులు మాత్రం కలత చెందుతున్నారు.
ఇన్ని రోజులు రజినీకాంత్ చెప్పిందే వేదంగా భావించిన అభిమానులు రజినీకాంత్ ప్రకటన చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై తాజాగా తిరుగుబాటు చేస్తున్నారు.
ఈనెల 31న పార్టీని ప్రకటిస్తానని చెప్పిన రజినీకాంత్ తాజాగా నిన్న పార్టీ పెట్టడం లేదంటూ.. అనారోగ్యమే కారణమని ఫ్యాన్స్ కు షాకిచ్చారు. రజినీ అభిమానులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజాగా రజినీకాంత్ నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఫ్యాన్స్ ఆందోళనలకు దిగారు. రజినీ రాజకీయాల్లోకి వస్తారని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని..ఆయన నిర్ణయం తమను ఎంతగానో బాధించిందని అంటున్నారు.
ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఇప్పుడు రజినీకాంత్ ఇంటికి తరలివస్తున్నారు. రజినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా చోట్ల రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ తో నిరసనలు కొనసాగిస్తున్నారు.