పట్టాభి తిట్టు మీద అద్భుత రిసెర్చ్

Update: 2021-10-21 10:32 GMT
టీడీపీ నాయకుడు పట్టాబి ఒక తిట్టు తిటారు అని వైసీపీ నేతలు అంటున్నారు. వారు అనడమే కాదు, పట్టాభి ప్రెస్ మీట్ చూసిన వారు కానీ ఆయన కళ్ళు ఎర్ర చేసి అధికార పార్టీని హెచ్చరించిన తీరుని గమనించిన వారు కానీ ఆయన ప్రేమగా మాట్లాడారు అని అసలు అనుకోరు. అంతవరకూ ఎందుకు భాష రాని వారు సైతం పట్టాభి ముఖ కవలికలను చూసి అయినా ఆయన మంచి ఫైర్ మీద ఉన్నారనే అంటారు. అలాంటి తిట్టు మీద గత రెండు రోజులుగా నెటిజన్లు విపరీతమైన సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ దాని అర్ధం ఏంటి అన్నదే నెటిజన్ల ఆవేదన, ఆరాటం. నెటిజన్ల ఉత్సాహం ఇలా ఉంటే టీడీపీని గట్టిగానే వెనకేసుకు వస్తున్న రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే పట్టాభి వాడిన బోసెడీకే అన్న పదానికి అర్ధం అద్భుతం అమోఘం అని లాజిక్ కి అందని మాట ఒకటి వదిలారు. సంస్కృతంలో బాగున్నారా అని ఎవరైనా అనాలంటే ఈ పదం వాడుతారు అన్నారు. అబ్బే అది అందమైన మాట, అసలు తిట్టే కాదు అని తేల్చేశారు రాజావారు.

ఇక ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వంతు. ఆయన‌ అయితే బోసేడీకే అన్న పదానికి ఏకంగా పదహారు అర్ధాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. గుజరాత్ లో ఏకంగా ఒక గ్రామానికే ఆ పేరు ఉందని అంటున్నారు. అందువల్ల పట్టాభి వాడిన పదం తప్పే కాదు, ముఖ్యమంత్రి జగన్ మంత్రులు వైసీపీ వారే తప్పుగా అర్ధం చేసుకున్నారని కూడా పయ్యావుల చెబుతున్నారు. కాసేపు ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకున్నా పట్టాభి లాంటి నాయకుడు, టీడీపీ అంటే పిచ్చి అభిమానం ఉన్న కరడు కట్టిన నేత జగన్ని కానీ వైసీపీ నేతలను కానీ ప్రేమగా ఎలా సంభోదిస్తారు అన్నదే ఇక్కడ పాయింట్. కనీసం లాజిక్ కూడా అది అందే విషయమేనా అన్నది టీడీపీ నేతలే జవాబు చెప్పాలని అంటున్నారు.

ఇక పట్టాభి ఈ రోజు కొత్తగా మాట్లాడినది కాదు అని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన గత కొంతకాలంగా ఇలా అసభ్య పదజాలన్ని ఉపయోగిస్తున్నారు అని కూడా వారు ఆరోపిస్తున్నారు . చవట, దద్దమ్మ, సన్యాసి, పాలేరు వంటి పదాలను కూడా పట్టాభి అదే ప్రెస్ మీట్ లో వాడారు కదా, మరి వాటికి కూడా అందమైన ప్రేమ పూర్వకమైన అర్ధాలు ఉన్నాయా తమ్ముళ్ళూ అని వైసీపీ నేతలు అడుగుతున్నారు. ఎవరెన్ని అర్ధాలు వెతికినా పట్టాభి అయితే జగన్ని మెచ్చడు, అందులో రెండవ మాటే లేదు. వాడకూడని పదమే ఆయన వాడేశారు. ఒక విధంగా టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. దాంతోనే అర్జంటుగా తమ్ముళ్లకు మెదడుకు పదును పెట్టి ఆ పదం తప్పు కాదు, చాలా ఒప్పు అని చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్ ఆ పదానికి అర్ధమేంటో చెప్పేశాక తెలుగు జనాలు కూడా పరమార్ధం తెలుసుకున్నాక టీడీపీ తమ్ముళ్లు ఎన్ని కొత్త అర్ధాలు చెప్పినా కవరింగ్ కోసమే అంటున్నారు వైసీపీ నేతలు.
Tags:    

Similar News