టీమిండియా పేసర్ మొహ్మద్ షమీ అదరగొట్టాడు. టి20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపు అసాధ్యం అనుకున్న సందర్భంలో అద్భుతం చేశాడు. అసలు టి20 ప్రణాళికల్లో లేని షమి.. రాబోయే ప్రపంచ కప్ లో భారత ప్రధాన బౌలర్ గా వ్యవహరించనున్నాడు. దీనికిముందు అతడు టి20 ప్రపంచ కప్ రిజర్వ్ ఆటగాళ్లలో ఉన్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ర్పీత్ బుమ్రా గాయపడడంతో షమీకి ప్రధాన జట్టులోకి ప్రవేశం సులభమైంది. అయితే, మరో పేసర్ హైదరాబాదీ మొహ్మద్ సిరాజ్ ఇటీవల స్థిరంగా రాణించడంతో ఇద్దరిలో ఎవరిని టి20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలి అనే సందిగ్ధం ఏర్పడింది. దీనికి తెరదించుతూ సెలక్టర్లు షమీకి చోటిచ్చారు. కాగా, షమీ ఐపీఎల్ లో పలు జట్లకు ఆడినా.. టెస్టులు, వన్డేల్లో భారత ప్రధాన బౌలర్ అయినప్పటికీ అతడికి టి20 జట్టులో చోటు లేదు. పని భారం రీత్యా కూడా షమీని సెలక్టర్లు పొట్టి ఫార్మాట్ కు దూరం పెట్టేవారు. అయితే.. ఇప్పుడు అవసరం రీత్యా ఆడించక తప్పలేదు.
భలే మ్యాచ్ .. ఆస్ట్రేలియాతో సోమవారం టీమిండియా టి20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ ఆడింది. ది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57, 6 ఫోర్లు, 3 సిక్స్ లు) అద్భుతంగా ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ (33 బంతుల్లో 50, 6 ఫోర్లు, సిక్స్) రాణించాడు. అయితే, ఛేదనలో భారత బౌలర్లు తొలుత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (76) చెలరేగి ఆడాడు. మిచెల్ మార్ష్ (35), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23) ఫర్వాలేదనిపించారు. దీంతో ఆసీస్ కు చివరి రెండు ఓవర్లలో విజయానికి 15 పరుగులే అవసరం అయ్యాయి.
17 బంతుల్లో 6 వికెట్లు కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి లక్ష్యం దిశగా సాగుతున్న ఆసీస్ ను చివర్లో భారత బౌలర్లు పుంజుకుని కట్టడి చేశాడరు. దీంతో 17 బంతుల్లో ఆసీస్ ఆరు వికెట్లను కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేసింది. అందులోనూ జట్టు స్కోరు 180 పరుగుల వద్ద నాలుగు వికెట్లను చేజార్చుకోవడం గమనార్హం. చివరకు 180 పరుగులకే ఆలౌటైంది. చాలా రోజుల తర్వాత బౌలింగ్ చేసిన మహమ్మద్ షమీ అదరగొట్టాడు. కీలకమైన చివరి ఓవర్‌లో వికెట్లు తీయడంతోపాటు పరుగులు ఇవ్వకుండా గెలిపించాడు. వాస్తవానికి భారత బౌలర్లు మొదట్లో పరుగులు ధారాళంగా ఇచ్చారు. ఫించ్‌తోపాటు మార్ష్, మ్యాక్స్‌వెల్ సులువుగానే పరుగులు రాబట్టారు. దీంతో 18 ఓవర్లకు 171/5 స్కోరుతో ఆసీస్ నిలిచింది. అయితే ఇక్కడే అసలైన డ్రామా మొదలైంది.
టీమ్‌ఇండియా బౌలర్లకు ఫోబియా అయిన 19వ ఓవర్‌ను ఈసారి మాత్రం హర్షల్ పటేల్ అద్భుతంగా సంధించాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చి కీలకమైన ఫించ్ వికెట్ తీశాడు. విరాట్ కోహ్లీ చేసిన సూపర్ త్రో దెబ్బకు టిమ్ డేవిడ్ (5) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో చివరి ఓవర్‌లో 10 అవసరం కాగా.. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన షమీ అత్యుత్తమంగా వేశాడు. తొలి రెండు బంతులకు డబుల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బంతికి కమిన్స్ (4) ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో అద్భుతంగా ఒడిసిపట్టాడు. అనంతరం జోష్ ఇంగ్లిస్, కేన్ రిచర్డ్‌సన్‌ను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. భారత బౌలర్లలో షమీ 3, భువనేశ్వర్ 2.. అర్ష్‌దీప్, హర్షల్ పటేల్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
చివరి 4 బంతులకు నాలుగు వికెట్లు కెరీర్ లో ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టి20లు ఆడిన షమీ.. చివరి ఓవర్ ను మాత్రం బౌలింగ్ చేయలేదు. నేటి మ్యాచ్ లో ఆ అవకాశం దక్కింది. దీన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. అయితే, మ్యాచ్ లో అంతకుముందు షమీ బరిలో దిగలేదు. అనూహ్యంగా షమీని బౌలింగ్ కు దించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు అద్భుతమే చేశాడు. తొలి రెండు బంతులకు 2 పరుగుల చొప్పున ఇచ్చిన షమీ.. చివరి నాలుగు బంతులకు వికెట్లు తీశాడు. ఇందులో ఓ రనౌట్ ను స్వయంగా చేశాడు. మిగతా మూడు వికెట్లలో ఒకటి లాంగాన్ లో కోహ్లి పట్టిన ఒంటి చేతి క్యాచ్ తో రాగా.. మిగతా రెండూ బౌల్డ్ లు కావడం విశేషం. చివరి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడ్డాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.