తమ డిమాండ్ల సాధన కోసం రైతులు నిరసనలు నిర్వహిస్తుంటారు. దేశంలో ఇప్పటివరకూ రైతులు ఎవరూ చేయని రీతిలో నిరసనను చేపట్టారు తమిళనాడుకు చెందిన అన్నదాతలు. తమిళనాడును కరవు రాష్ట్రంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేసిన వారు.. చెన్నైలోని ఎగ్మోర్ స్టేషన్ కు సమీపంలో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు నిర్వహించిన నిరసనకు పలువురు భయాందోళనలకు గురయ్యారు.
చచ్చిన ఎలుకల్ని నోళ్లల్లో పెట్టుకున్న అన్నదాతలు తమ నిరసనను తెలియజేశారు. అర్థనగ్నంగా నిరసన నిర్వహిస్తూ కొందరు.. మరికొందరు నోళ్లకు ఎలుకల్ని పట్టుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున నిరసనను నిర్వహించారు. రాస్ట్రాన్ని కరవు రాష్ట్రంగా ప్రకటించటం.. రైతుల రుణాల్నిమాఫీ చేయటం.. అప్పుల బాధలతో మరణించిన అన్నదాతల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ కోరారు.
కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకూ తమ నిరసనను తెలియజేస్తుంటామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఎలుక మాంసంతో నిర్వహించిన తాము.. బుధవారం పాము మాంసంతో నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. వీరి నిరసన ఏమో కానీ.. ఈ వినూత్న నిరసన పలువురిని భాయాందోళనలకు గురి చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/