వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు - ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్ మోహాన రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం స్రుష్టిస్తోంది. కాపు కులస్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలో వారికి రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటనతో తెలుగుదేశం నాయకులు చంకలు గుద్దుకున్నారు. ఇక జగన్ పని అయిపోయిందని సంబరపడ్డారు. జగన్ కాపులకు దూరమైనట్లేనని కేరంతలు కొట్టారు. అయితే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రిజర్వేషన్లపై ప్రకటన అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా రైతులు ప్రతీ చోట ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయంలో ఉన్నవారు ఎక్కువగా కాపులే. ఉభయ గోదావరి జిల్లాలలో కాపుల ప్రధాన వ్రుత్తి వ్యవాసాయమే. కాపు రిజర్వేషన్లపై తన నిజాయితీతో కూడిన ప్రకటన అనంతరం కాపు కులస్థులు ఒకటి రెండు రోజులు ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవమే. అయితే జగన్ ప్రకటనలోని నిజాలను గ్రహించిన కాపు కులస్థులు ఆయన వెంట నడిచేందుకు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి గడచిన వారం రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు వస్తున్న రైతులే తార్కణం.
మరోవైపు యువత - నిరుద్యోగులు పెద్దఎత్తున జగన్ పాదయాత్రలో పాల్గోంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు వెయ్యి రుపాయల నిరుద్యోగ భ్రుతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా అది కంటి తుడుపు చర్యగానే వారు పరిగణిస్తున్నారు. పైగా బాబు వస్తే జాబు వస్తుంది అని నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన అమలులోకి రాలేదని నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు చూపించక పోగా నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగ భ్రుతి ప్రకటించడం దారుణమని అంటున్నారు. తాను ఏంచేస్తానో - ఏది సాధ్యం కాదో - కేంద్రం చేతిలో ఏఏ అంశాలున్నాయో స్పష్టంగా చెప్పుతున్న జగన్ వల్లే తమకు మేలు జరుగుతుందని నిరుద్యోగులు నమ్ముతున్నారు. ఈ నిజాయితీ వల్లే అటు రైతులు - ఇటు నిరుద్యోగులు - మహిళలు జగన్ కు పట్టం కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇది తూర్పు గోదావరి జిల్లా నుంచే ఆరంభం కానుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.