ఎమ్మెల్యేల కేసు వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. ఈ కేసును సీబీఐ విచారించాలని ఆర్డర్ పాస్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించనున్నారు. అయితే సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వం ఆధారాలను సీబీఐకి ఇవ్వాలనే నిబంధనలు లేవని, సీఐడీకి కూడా ఇవ్వొచ్చని దుష్యంత్ దవే వాదనలు వినిపంచారు.
ఈ సందర్భంగా సెక్షన్ 173 (8) కింద విచారణ జరపాలని అన్నారు. అక్టోబర్ 29న మెజిస్ట్రేట్ ముందుకు సీడీల రూపంలో ఆధారాలు ఇస్తే కోర్టు తప్పుపట్టడం సరైంది కాదని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదుపై గాని, ట్రాప్ పై గానీ ఎలాంటి అనుమానాలు లేవని వాదించారు. సీడీల విషయంలో ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై దవే వాదనలు విన్న కోర్టు మరోసారి మంగళవారం వర్చువల్ గా విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో కొందరికి బెయిల్ రాగా.. మరికొందరు రిమాండ్ లోనే ఉన్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం సిట్ ను విచారించాలని కోరగా..నిందితుల అభ్యర్థన మేరకు కోర్టు సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. కానీ సీఐడీ ద్వారా విచారణ చేపట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అటు సీబీఐ విచారణ తోనే అన్ని నిజాలు బయటపడుతాయని ప్రతివాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇరువురి వాదనలు విన్న కోర్టు సీడీల గురించి విచారణ ఎందుకని ఈ కేసులో పురోగతి ఏంటని ప్రశ్నించింది. పదే పదే అవే వాదలను కాకుండా కొత్త విషయాలు చెప్పాలని తెలిపింది. అటు నిందితుల తరుపున న్యాయవాదులు సైతం ప్రభుత్వం తరుపున ఈ వాదనలు ఎప్పుడో చేసిందని అన్నారు. దీంతో నేటి విచారణకు దవే ఎలాంటి సమాచారంతో వస్తారనే ఆసక్తి నెలకొంది.
ఈ కేసులో కేంద్రం కూడా ఇన్వల్వ్ అయిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సిట్ ను విచారించడానికి ఆదేశాలు జారీ చేసింది. కానీ సీబీఐ రంగంలోకి దిగడంతో ప్రభుత్వం కోర్టులో ఆ విచారణను అడ్డుకునేందుకు పిటిషన్ వేసింది.
మరోవైపు సీబీఐ తన విచారణను వేగవంతం చేసే అవకాశం ఉంది. మంగళవారం గనుక దవే వాదనలను కోర్టు పట్టించుకోకపోతే మరో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ గ్యాబ్ లో సీబీఐ కీలక ఆధారాలుసేకరిస్తే బీఆర్ఎస్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అక్రమంగా విచారణ సంస్థలను ఉసికొల్పుతున్నాయని ఆరోపణలు వస్తున్నా.. ఆ సంస్థలు ఇచ్చేనివేదికతోనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.