పక్కడో ధర్మం మీద నీతులు చెప్పే నేతలు..తాము నమ్మే మతానికి సంబంధించి మాత్రం నోట మాట రాదు. తాజాగా జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తీరు చూస్తే ఇదే తీరులో ఉంటుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బృందావన్ లో వితంతు మహిళలంతా కలిసి హోలీ సంబరాలు జరుపుకోవటాన్ని ఆయన స్వాగతించారు. ఇదే సమయంలో దేశంలోని ఆలయాల్లోకి మహిళల్ని అనుమతించాలని చెప్పుకొచ్చారు.
దేశంలోని కొన్ని ఆలయాల్లోకి మహిళలకు అనుమతి లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఘర్షణలు జరుగుతోంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఫరూక్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాను పాటించే ధర్మంలోని అంశాల్నిప్రస్తావించని ఫరూక్.. ఎదుటోడి ధర్మానికి సంబంధించిన అంశాల మీద పలు వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. ముస్లిం మహిళలకు తలాక్ అన్న నోటి మాటతో విడాకులు ఇచ్చేసే అంశంపై ముస్లిం మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి.. ఈ విషయం మీద మహిళల మాటకు తగ్గట్లే మార్పులు వచ్చేలా ఎందుకు నడుం బిగించరు. అదే చేస్తే.. ఆయన చరిత్రలో మిగిలపోతారు కదా?