కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానం ఫాస్టాగ్ లేని కారణంగా ఆదివారం పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటివరకూ అనుసరించిన విధానానికి భిన్నంగా ఆదివారం కొత్త విధానాన్ని అమలు చేయటం.. దాని కారణంగా తలెత్తిన ఇబ్బందులు భారీగా ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా పాత విధానాన్ని తెర మీదకు తీసుకురానున్నారు. టోల్ గేట్ల వద్ద ఇప్పటివరకూ అయితే ఫాస్టాగ్.. లేదంటే డబ్బులు చెల్లించే వీలుండేది.
తాజాగా వచ్చిన నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫాస్టాగ్ తో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఫాస్టాగ్ లేకుంటే అలాంటి వారు నగదు చెల్లించి ఆ కౌంటర్ నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న లేన్లలో ఒక్క లైను మాత్రమే నగదు చెల్లించేందుకు వీలుగా.. మిగిలిన లైన్లు ఫాస్టాగ్ కోసం కేటాయించారు.
ఈ విధానంలో వాహనదారులు ఫాస్టాగ్ కు అలవాటు పడకపోవటంతో ఆదివారం టోల్ ఫ్లాజాల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. దీంతో.. ఇప్పటి విధానాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరే క్యాష్ కౌంటర్లను పెంచనున్నారు.
మరో నెల రోజుల పాటు పాత విధానాన్నే అమలు చేయనున్నారు. వచ్చే సంక్రాంతి వరకూ మూడొంతుల లైన్లు నగదు చెల్లించేలా.. మరో వంతు ఫాస్టాగ్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ కాకున్నా రేపైనా.. అదేనండి నెల తర్వాత అయినా ఫాస్టాగ్ వాడటం తప్పనిసరి అయినప్పడు.. ఆ మార్పు ఏదో ముందే మారిపోతే.. అనవసరమైన తిప్పలు తప్పుతాయి కదా?