కరోనాతో ఎంత కష్టమంటే..వీడియో కాల్ లో కూతురి అంత్యక్రియలు

Update: 2020-04-04 15:00 GMT
ప్రాణాంతక వైరస్ గా మారిన కోవిడ్-19 కారణంగా ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అన్ని విషయాల్లో అగ్రరాజ్యంగా విరాజిల్లుతున్న అమెరికా సైతం కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ఇలాంటి సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మాత్రం అందరినీ కంట తడిపెట్టిస్తోంది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కూతురు.. అనారోగ్యంతో చనిపోతే... శోకసంద్రంలో కూరుకుపోయిన ఓ తండ్రికి కనీసం కూతురి అంత్యక్రియాల్లో ప్రత్యక్ష్యంగా పాల్గొనలేకపోయిన కష్టం వచ్చింది. చివరకు వీడియో కాల్ లోనే కూతురి అంత్యక్రియలను వీక్షించిన ఆ తండ్రికి వచ్చిన కష్టం నిజంగానే పగోడికి కూడా వద్దన్న మాట వినిపిస్తోంది.

ఈ ఘటన ఎక్కడో జరగలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోనే చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

జగిత్యాల జిల్లా బీర్‌ పూర్‌ మండలం తుంగూరు గ్రామానికి చెందిన పాలాజీ భాస్కర్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం ఐదు నెలల క్రితం దుబాయ్‌ కు వెళ్లాడు. అతడి కుమార్తె గత కొన్ని రోజులుగా డయాబెటిస్‌ తో బాధపడుతోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి శుక్రవారం చనిపోయింది. కరోనా నేపథ్యంలో భారత్ లాక్ డౌన్ ప్రకటించగా..  దుబాయ్‌ లోనే ఇరుక్కుపోయిన భాస్కర్.. తన కుమార్తె అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో చేసేదేంలేక తన గారాలపట్టి అంత్యక్రియలను వీడియో కాల్‌ లో చూసి.. కన్నీరుమున్నీరయ్యారు.
Tags:    

Similar News