ముస్లిం మహిళలపై ఫత్వా..

Update: 2018-11-05 11:30 GMT
ముస్లిం మహిళలపై ముస్లిం చాంధస సంస్థ కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు ఇక నుంచి గోళ్లు కత్తిరించుకోవద్దని.. అలాగే గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోరాదని ఆ ఫత్వాలో పేర్కొంది. ఇలా చేయడం ఇస్లాం కు వ్యతిరేకమంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ అనే ముస్లిం సంస్థ సభ్యుడు ముఫ్లి ఇష్రార్ ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ లో ప్రకటించారు.

పురుషులు గడ్డం తీసుకోవడం ఇస్లాంకు ఎంత వ్యతిరేకమో.. మహిళలు కనుబొమ్మలు ట్రిమ్ చేసుకోవడం కూడా అంతే నేరమని ముఫ్తి ఇష్రార్ తెలిపారు. మహిళలు గోరింటాకు పెట్టుకోవడంపై మాత్రం నిషేధం లేదని తెలిపారు. అయితే మహిళలు లిప్ స్టిక్ పెట్టుకోవడం.. తల వెంట్రకలు కట్ చేయడం మాత్రం తీవ్ర నేరంగా ఆయన పేర్కొన్నారు. ముస్లిం మహిళలు బ్యూటీపార్లర్లకు వెళ్లడం మంచిది కాదని తెలిపారు.

గతంలో కూడా దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇలాంటి ఫత్వాలను జారీ చేసింది. పరాయి పురుషులను ఆకట్టుకునే విధంగా ముస్లిం మహిళలు తయారు కాకూడదని పేర్కొంది.ఇప్పుడు మరో ఫత్వా జారీ చేసి వార్తల్లో నిలిచింది.
Tags:    

Similar News