చంద్రయాన్2 పై పాకిస్తాన్ అక్కసు

Update: 2019-09-07 10:48 GMT
భారత్ కలల ప్రాజెక్ట్ చంద్రయాన్ 2 చివరి నిమిషంలో సిగ్నల్స్ కట్ అయిపోవడంపై శత్రుదేశం పాకిస్తాన్ పండుగ చేసుకుంటోంది. భారత ప్రయోగం సక్సెస్ అయ్యి ఉంటే భారతీయులు ఎంత సంతోషించి ఉండేవారో.. ఇప్పుడు ఫెయిల్ అయినందుకు పాకిస్తానీలు కూడా అలానే సంబరపడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ చౌదరి తన నోటిదురుసును ప్రదర్శించాడు. భారత్ చంద్రయాన్ 2 ప్రయోగం ఫెయిల్ అయ్యిదంటూ ట్విట్టర్ లో రెచ్చిపోయాడు.

పాకిస్తాన్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ తాజాగా భారత్ చంద్రయాన్ పై విషం కక్కారు... ‘రాని పనిలో వేలు పెట్టొద్దు.. డియర్ ఎండియా’ అంటూ ఎటకారంగా దేశం పేరును సైతం ఎద్దేవా చేస్తూ  వ్యాఖ్యలు చేశారు.  ఆ తర్వాత వరుసగా ఇస్రోపై, భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూనే ట్వీట్లు పెట్టాడు.

పాకిస్తాన్ మంత్రి ట్వీట్ పై ఇండియన్ నెటిజన్లు భగ్గుమన్నారు.. ‘చంద్రయాన్2పై విషం కక్కిన మంత్రి వర్యా మా ప్రయోగం కోసం నువ్వు రాత్రంతా మేల్కోనే చూశావ్ మరిచిపోకు’ అంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. ఇక మేం కనీసం ప్రయత్నమైనా చేశామని.. మీ పాకిస్తాన్ ఆ కనీస పరిజ్ఞానం కూడా లేదని కొందరు నెటిజన్లు మండిపడ్డారు..

ఇక ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఫవాద్ మరింత రెచ్చిపోయాడు. చంద్రయాన్ 2 చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదని.. ముంబైలో ల్యాండ్ అయ్యిందని ఎద్దేవా చేశారు. భారత ప్రధాని 900 కోట్ల నిధులను బుగ్గిపాలు చేశాడని.. దీనిపై ప్రతిపక్షాలు నిలదీయాలంటూ తన అక్కసును భారత్ పై ఆడిపోసుకున్నారు. ఇప్పుడు ఇండియన్ నెటిజన్లంతా పాక్ మంత్రిని ట్రోల్ చేస్తూ కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.


Tags:    

Similar News