ఆ గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో భయం మొదలైంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు.. టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం అందులోకి ఎంట్రీ ఇచ్చేందుకు వణుకుతున్నారు. నూతనంగా నిర్మించిన ఆ భవనాల్లోకి వెళ్లేందుకు ఆ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. ఎందుకు ఆ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.
కామారెడ్డి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ క్యాంప్ ఆఫీసుల్లోకి అడుగు పెట్టేందుకు భయపడిపోతున్నారట.. వాటి వైపు చూసేందుకు ఇష్టపడడం లేదట.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తన క్యాంప్ కార్యాలయాన్ని వడ్లూర్ లోని నూతన కలెక్టరేట్ సమీపంలో నిర్మించారు. అన్ని హంగులు అత్యాధునిక డిజైన్ తో తీర్చిదిద్దారు. స్పీకర్ పోచారంతో 2018లో ప్రారంభించాడు. అప్పుడు అడుగుపెట్టిన ఎమ్మెల్యే మళ్లీ కన్నెత్తి చూడడం లేదట.. కార్యకర్తలు సైతం అందులోకి రావడానికి భయపడుతున్నారు. అది జిల్లాకేంద్రానికి దూరంగా ఉండడం.. ప్రస్తుతం ఉన్న ఇల్లు గంపా గోవర్ధన్ కు బాగా కలిసిరావడంతో కార్యాలయంలోకి అస్సలే పోవడం లేదట..
ఇక మరో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా క్యాంప్ ఆఫీసులోకి అడుగుపెట్టడం లేదు. వాస్తు దోషం కారణంగా ఆఫీసును ప్రారంభించినా అందులోకి అడుగు పెట్టడం లేదట.. దీంతో టీఆర్ఎస్ నేతలు వెళ్లడం లేదు.
ఇలా నెలల తరబడి ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో అది బూజు పట్టిపోయిందట.. ఇలా ఎమ్మెల్యేలే గుడ్డి నమ్మకాలతో ప్రభుత్వ కార్యాలయాలను దూరంగా పెట్టడం విలువైన భవనాలు వృథాగా మారిపోతున్నాయి.