భయం అనే మాట టీడీపీ బయోడేటాలో లేదని.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. .ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో! అని సీఎం జగన్‌కు ఆయన సవాల్ విసిరారు. కడపలో పర్యటించిన ఆయన..మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు, జన సేన కార్యకర్తల అరెస్టు చేయడం.. దారుణమని వ్యాఖ్యానించారు. అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించిన ఘనత తమదేనన్నారు.
పులివెందుల కి నీళ్ళు ఇచ్చింది టిడిపి ప్రభుత్వమేనని నారా లోకేష్ గుర్తు చేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మూడున్నర ఏళ్ళు అయ్యిందని కానీ, సొంత జిల్లా కి చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో బస్ స్టాండ్ కట్టలేని వాడికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఏడాది కిందట రాజంపేట మండలంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 40 మంది చనిపోయారని, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, ఇళ్లు కోల్పోయిన మూడు గ్రామాల ప్రజలకు ఇల్లు కట్టిస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ పునాదుల దశ దాటలేదని లోకేష్ విమర్శలు గుప్పించారు.
"జమ్మలమడుగు వద్ద కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ రెడ్డి శంకుస్థాపన చేసి మూడేళ్లు అయ్యింది. అక్కడ శిలాఫలకం తప్ప ఏమి లేదు. వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారు. జగన్ రెడ్డి చెల్లెలు సునీతా రెడ్డి ఒంటరి గా పోరాడుతున్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసాడు. ఎలక్షన్ ముందు డ్రామా చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు బాబాయ్ హత్య గురించి మాట్లాడటం లేదు?" అని నిలదీశారు.
రాజధాని పై మాట మార్చింది... మడమ తిప్పింది జగన్ రెడ్డి అని లోకేష్ అన్నారు. 2014 ఏప్రిల్ 13న మ్యానిఫెస్టో విడుదల చేస్తూ హైదరాబాద్ ని మించిన నగరం... వాషింగ్టన్ డిసి లాంటి నగరం కడతాం అని అన్నారని గుర్తు చేశారు. ఎన్నికలు అయిన తరువాత 2014 జులై 23న జగన్ రెడ్డి .. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని, కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అన్నారని, 2014 సెప్టెంబర్ 4 న జగన్ రెడ్డి అసెంబ్లీలో.. అమరావతి లో రాజధాని ని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారని తెలిపారు.
జగన్ రెడ్డి గారి కోరిక మేరకే మేము అమరావతిని రాజధానిగా ప్రకటించామని లోకేష్ చెప్పారు. "2017 జూలై 9 న ప్లినరీలో అమరావతి వేదికగా చెబుతున్నా ఇక్కడే రాజధాని అన్నారు. 2017 జూలై 19 న అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, రైతులు ఆనంద పడేలా రాజధాని నిర్మిస్తా అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ రెడ్డి మాట మార్చారు.. మడమ తిప్పారు. అమరావతిపై అనేక ఆరోపణలు చేసారు. ఒక్కటి కూడా నిరూపించలేక పోయారు" అని లోకేష్‌వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.