ఒక్క డోసు వేయించుకున్న వారికి గుడ్ న్యూస్ .. వారికి ఆ భయం లేదట !

Update: 2021-05-12 02:30 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో అందరూ వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. కానీ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో కనీసం వైద్యులు కూడా టీకా తీసుకోవడానికి భయపడేవారు. కోవీషీల్డ్, కో వ్యాక్సిన్ వంటి వ్యాక్సిన్ లు ప్ర‌భుత్వ వైద్య కేంద్రాల్లో అందుబాటులోకి  వచ్చినప్పటికీ కూడా వేసుకోవడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించలేదు. దానికి ప్రధాన కారణం .. అప్పుడు దేశంలో కరోనా విజృంభణ చాలా తక్కువగా ఉండేది. దీనితో ఇక కరోనా ఖతం అయిందిలే అని చాలామంది అనుకున్నారు. ఉచితంగా వేస్తామంటున్నా వ్యాక్సిన్ కేంద్రాల వైపు వెళ్ల‌డానికి జ‌నాలు పెద్ద ఉత్సాహం చూపలేదు. 45 యేళ్ల పై వ‌య‌సు వారు వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని ప్ర‌భుత్వాలు  చెప్పినా కూడా  వ్యాక్సిన్ విష‌యంలో ఉన్న భ‌యాల నేప‌థ్యంలో చాలా మంది దాన్ని వేయించుకోలేదు. అందులోనూ కేసుల సంఖ్య త‌గ్గిపోవ‌డం, జ‌న‌జీవ‌నం అప్ప‌టికి మామూలు స్థితికి రావ‌డంతో  వ్యాక్సిన్ గురించి ఆలోచించడం మానేశారు.

అయితే, అప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇప్పుడు కొంచెంలో కొంచెం సేఫ్ అవుతున్నార‌ని వివిధ అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో అనేక మందికి  మరోసారి కరోనా భారిన పడుతున్నా కూడా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి క‌రోనా కార‌ణ మ‌ర‌ణ భ‌యం మాత్రం చాలా త‌క్కువ అని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. దేశంలో  విస్తృతంగా వేస్తున్న కోవీషీల్డ్  గురించి ఇంగ్లండ్ లో జ‌రిగిన అధ్య‌య‌నం ప్ర‌కారం  క‌నీసం ఒక డోసు కోవీ షీల్డ్ వేయించుకున్న వారికి కూడా క‌రోనా మ‌ర‌ణ భ‌యం చాలా త‌క్కువట‌. ఒక డోసు ఈ వ్యాక్సిన్ వేయించుకున్నా వారికి క‌రోనా సోకినా 80 శాతం  మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోవచ్చట.  ఇక రెండు డోసుల కోవీషీల్డ్  వేయించుకున్న వారిలో 97 శాతం మందికి క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణ‌భ‌యం ఉండ‌నే ఉండ‌ద‌ట‌. ఇలా ఇప్ప‌టికే వ్యాక్సిన్ వేయించుకున్న వారు సేఫ్ జోన్లో ఉన్నార‌ని ఈ బ్రిటీష్ అధ్య‌య‌నం చెబుతోంది.  అయితే దేశంలో ఇప్పటికే రెండు డోసులు వేసుకున్న వారు మాత్రం చాలా తక్కువగానే ఉన్నారు.
Tags:    

Similar News