కంటికి కనిపించని కొవిడా వైరస్ కు తోపు దేశాలు సైతం వణికిపోయే పరిస్థితి. మన తోటి వారు అన్న బాధ్యత లేకుండా.. ఎవరికి వారు మనకెందుకులే అని వదిలేసిన వేళ.. ఒక దేశం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు..అంతులేని మానవత్వాన్ని ప్రదర్శించి.. ప్రపంచానికి సరికొత్త పాఠాన్ని నేర్పింది. చైనాలో మొదలైన కొవిడా వైరస్.. ప్రపంచ దేశాల్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలాంటివేళ.. వెస్ట్ మిస్టర్ డామ్ ఓడ సముద్రం లో చిక్కుకు పోయింది. కొవిడా వైరస్ భయంతో తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు వీల్లేదని జపాన్.. తైవాన్.. ఫిలిప్పీన్స్.. థాయ్ ఇలా పలు దేశాలు ఆ ఓడను తమ భూభాగంలోకి వచ్చేందుకు అనుమతించలేదు. దీనికి కారణం.. ఓడ లో ప్రయాణిస్తున్న వారికి కరోనా వైరస్ లక్షణాల తో బాధ పడుతున్నారన్న భయమే.
ఓడను తమ తీరంలోకి రానిస్తే.. అందులోని వారిని దేశంలోకి ఎంట్రీ ఇస్తే.. వారి కారణంగా దేశంలోకి ప్రమాదకర వైరస్ ఎంట్రీ ఇస్తుందన్నది పలు దేశాల భయం. దీంతో.. ఎవరికి వారు ఆ ఓడను అనుమతించేందుకు సాహసించలేదు.దీంతో.. ఓడలోని వందలాది మంది ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని కిందామీదా పడిపోతున్నారు. దాదాపు రెండు వారాలుగా సముద్రం లో ఉన్న వారికి.. ఊహించని విధంగా కంబోడియా తమ దేశానికి రావాలని ఆహ్వానం పలికింది.
పలు దేశాలు భయంలో నో చెబితే.. అందుకు భిన్నంగా కంబోడియా లాంటి చిన్న దేశం ముందుకు రావటం ఒక ఎత్తు అయితే.. తొలుత నౌకను తమ తీరంలోకి రానిచ్చింది. తర్వాత వైద్యుల్ని పంపి పరీక్షలు జరిపింది. వైరస్ లేని వారికి ప్రత్యేక బసను ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఓడలో అనారోగ్యంతో బాధ పడుతున్న 20 మందిని మాత్రం మిగిలిన వారికిదూరంగా ఉంచి ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు పేర్కొంది. ఇలా తోపులమని చెప్పుకునే దేశాలు సైతం వణికే వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రపంచ ప్రజఅ మనసుల్ని దోచుకునేలా చేశారని చెప్పాలి.