ఈ భయాలు మీలో ఉంటే సెక్స్ చేయలేరు..!!

Update: 2021-09-21 06:09 GMT
జీవితంలో ప్రతి ఒక్కరు సెక్స్ అవసరం. అయితే దాని సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇందులో పాల్గొనాలి.  పెళ్లయిన ప్రతి ఒక్కిరికి శృంగారం రోజులో భాగమైపోతుంది. అయితే కొందరు దీనిని ఒక క్రమపద్ధతిలో ప్లాన్ వేసుకొని అందులో స్వర్గాన్ని చూస్తారు. ఇంకొందరు దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతారు. ముఖ్యంగా సెక్స్ గురించి పూర్తిగా తెలుసుకోకపోయినా.. అవసరానికి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రధానంగా సెక్స్ లో పాల్గొనే వారిలో భయాందోళనలు వీడాలి. కొన్ని భయాల వల్ల వీరు ఆ పని చేయలేక వారిలో వారే కుమిలి పోతారు. ఆ తరువాత ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

చాలా మంది తమలో తామో తప్పు చేశారని, తాము ఇక సెక్స్ కు పనికి రామనే భ్రమలో ఉండిపోతారు. దీనివల్ల తమ భాగస్వామితో సంతోషంగా శృంగారంలో పాల్గొనలేకపోతారు. ఆ తరువాత ఇద్దరు నిరాశ పడాల్సి వస్తుంది. శృంగార విషయంలో ముందుగా మనలోని ఉన్న భయాలెంటో తెలుసుకొని వాటిని పారద్రోలినట్లయితే అందులో స్వర్గం చూడొచ్చని కొందరు మానసినక శాస్త్రనిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ భయాల గురించి తెలుసుకుందాం..

- అవాంచిత గర్భం:

పెళ్లయిన వారు శృంగారంలో అనుభూతి పొందండంతో పాటు పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడుతారు. అయితే కొందరు పెళ్లికి ముందు కూడా శృంగారంలో పాల్గొనాలనుకునేవారు అవాంఛిత గర్భంపై ఆందోళన పడుతారు. దీంతో శృంగారంలో పాల్గొన్న సమయంలో భావప్రాప్తికి ముందే విరమించుకొని అసంతృప్తి చెందుతారు. అంటే అవాంచిత గర్భానికి భయపడి వారు సెక్స్ లో తృప్తి పొందలేరు. ఇలా తమ పార్ట్ నర్  కూడా అసంతృప్తి చెందడంతో నిరాశ చెందుతుంది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధాల్లో మనస్పర్థలు వస్తాయి. ఆ తరువాత వేరే పరిస్థితికి దారి తీస్తుంది. ఇక పెళ్లయిన వారు సైతం కొన్ని రోజులు తమకు అప్పుడే పిల్లలు వద్దనుకుంటారు. దీంతో చాలా సార్లు సెక్స్ కు దూరంగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల దంపతుల మధ్య సంబంధాలు చెడిపోయిన సంఘటనలూ ఉన్నాయి.

- సంక్రమణ వ్యాధుల భయం:

సెక్స్ లో పాల్గొనడం వల్ల సంక్రమణ వ్యాధులు వస్తాయని చాలా మందిలో భయం ఉంటుంది. వాటి గురించి పూర్తిగా అవగాహన లేకపోవడంతో మొత్తంగా సెక్స్ చేయడానికే దూరంగా ఉంటారు. ఇలా తమ కోరికలను అణచుకొని సుఖాన్ని కోల్పోతారు. ఈ సమయంలో తమ పార్ట్ నర్ కు సెక్స్ కావాలన్న సమయంలో సంతోషాన్ని ఇవ్వలేకపోతే వారి దృష్టిలో చులకనగా మారిపోతారు. ఒక్కోసారి మీ భాగస్వామిలో అమితంగా కోరికలు కలిగితే  అ సమయంలో వారికి కావాలిసిన సంతోషాన్ని ఇవ్వనట్లయితో పక్కచూపులు చూసే ప్రమాదాలు లేకపోలేదు.

- కండోమ్ వాడడం తెలియకపోవడం:

అవాంచిత గర్భం వద్దనుకున్న వారు కండోమ్ వాడి సెక్స్ లో పాల్గొంటారు. అయితే దీనిని సరైన పద్దతిలో వాడితే శ్రేయస్కరంగా ఉంటుంది. ఒక్కోసారి ఇది లీకేజీ అయి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భయం చాలా మందిలో ఉంటుంది. ఈ భయంతో మొత్తంగా శృంగారంలో పాల్గొనడానికే ముందుకురారు. దీంతో వారిలో వారికి లేని పోని భయాలు మొదలై మనస్పర్థలు మొదలవుతాయి.

ఇలా ప్రతీ చిన్న విషయానికి భయపడిపోతుండడంతో మీ భాగస్వామి మీ పై నమ్మకం కోల్పోతుంది. దీంతో మీలో ఆత్మ విశ్వాసం దెబ్బతిని రాను రాను మొత్తంగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందువల్ల సెక్స్ విషయంలో ఏమాత్రం సందేహాలున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. లేకుంటే లేని పోని భయాలతో జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
Tags:    

Similar News