మానవబాంబును అడ్డుకుని హీరో అయ్యాడు

Update: 2015-11-18 09:48 GMT
ప్రపంచమంతా చర్చనీయాంశమైన పారిస్ ఉగ్రవాద దాడులకు ఒక్క రోజు ముందు జరిగిన సంఘటన ఒకటి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పారిస్ దాడులకు ముందు రోజు లెబనాన్ లో ఆత్మాహుతి దాడులు జరగడం 45 మంది చనిపోవడం తెలిసిందే. అయితే దాడులు జరిగిన లెబనాన్ రాజధాని బీరూట్ లో ఒక సాధారణ పౌరుడు తన ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజల ప్రాణాలను రక్షించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఒక సూసైడ్ బాంబర్ పై ఆయన దాడిచేసి ఆపడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడినవాడయ్యాడు. అయితే... దురదృష్ణవశాత్తు ఆయన తన ప్రాణాలు కోల్పోయాడు.

బీరూట్ కు చెందిన ఆదిల్ టెర్మాస్ తన కుమార్తెతో కలిసి బజారులో సామాన్లు కొంటున్నాడు. అదే సమయంలో మానవ బాంబు ఒకరు తనను తాను పేల్చుకోవడంతో పరిస్థితి భయానకంగా మారిపోయింది. కుమార్తెను ఎత్తుకుని అక్కడి నుంచి పారిపోబోయిన ఆదిల్ కు మరో మానవబాంబు పేల్చుకోవడానికి సిద్ధపడుతుండడం కనిపించింది. అంతే... ఆయన ఇంకేమీ ఆలోచించలేదు... కుమార్తెను కిందకు దించి.. ఒక్క ఉదుటన ఆ ఉగ్రవాది ఎగిరి దుమికాడు. ఉగ్రవాదిని కుళ్లబొడిచి బాంబును నిర్వీర్యం చేశాడు. అయితే... ఉగ్రవాదులు మాత్రం ఆయన్ను కాల్చేశారు. దీంతో వందలాది మందిని కాపాడగలిగిన ఆయన మృతిచెందాడు. ప్రపంచం ఇప్పుడు ఆ హీరో గొప్పదనాన్ని గుర్తించింది. అందరిలా పారిపోకుండా తన ప్రాణాలకు వెరవక వందలాది మందిని కాపాడంటూ అంతా కీర్తిస్తున్నారు.
Tags:    

Similar News