ఆమె ఒక ప్రముఖ మహిళా రిపోర్టర్. ఒక ప్రముఖ ఛానల్ కు పని చేస్తూ ఉంది. ఒక జర్నలిస్టుగా ఎంతగా పని చేసినా.. వచ్చేది ఒక రకమైన జీతమే. అలాంటి జీతంతో అమరావతి వంటి ప్రాంతంలో ప్లాట్ కొనడం మాత్రం తేలిక కాదు. అసలే అది అమరావతి! ధరలు మొదటి నుంచి పతాక స్థాయికి చేరాయి. రాజధానిగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో భూముల ధరలు గరిష్ట స్థాయిలోనే ఉండేవి. ఇక చంద్రబాబు నాయుడి హయాంలో రాజధానిగా ప్రకటించబడ్డాకా అక్కడ భూముల ధరలు మరింత గరిష్ట స్థాయికి చేరాయి.
అలాంటి అమరావతిలో ఒక సాధారణ మహిళా టీవీ రిపోర్టర్ ప్లాట్ కొన్నదంటే మాటలు కాదు. అయితే అది కొనుగోలు చేసినది కాదని.. అదొక గిఫ్ట్ అని టాక్! ఆ గిఫ్ట్ ను ఇచ్చింది కూడా ఒక మీడియా అనుబంధ పెద్ద మనిషేనట. ఆయన ఆ మహిళా రిపోర్టర్ కు అమరావతిలో ప్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట.
ఇంతకీ ఆ గిఫ్ట్ ఇవ్వడంలో పరమార్థం ఏమిటి? అదెందుకు? అనేది మాత్రం రహస్యమే! అది వారిద్దరికీ మాత్రమే తెలిసిన వ్యవహారం అని సమాచరాం. సదరు గిఫ్ట్ ఇచ్చిన పెద్దమనిషి ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలోనే ఉన్నాడట. మీడియా రంగం నుంచి వచ్చిన గుర్తింపుతో ప్రభుత్వ పదవినీ పొందారు. అలా మంచి రేంజ్ కు ఎదిగిన ఆయన ఇలా మహిళా రిపోర్టర్ కు చాలా ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చిన వైనం ఇప్పుడు బయటకు వచ్చింది.
ఆ గిఫ్ట్ ఇచ్చింది కూడా ఇప్పుడు కాదట.. రెండు మూడేళ్ల కిందటే! అయితే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను బయటకు తీస్తూ ఉన్నారు. అక్కడ భూములు కొన్న వారు ఎవరు, వారి ఆర్థిక శక్తి ఎంత, ఎవరిరకి ఎవరు బినామీలుగా ఆ ఆస్తులను కొన్నారనే అంశంపై పరిశోధన సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ యాంకర్ వ్యవహారం కూడా బయటకు వచ్చినట్టుగా భోగట్టా!